పవన్ ముందుకు మరో "గోట్ లైఫ్" ఘటన.. ! సూపర్ ఫాస్ట్ రియాక్షన్..!
ఏపీలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల విషయంలో ఎంత స్పీడుగా స్పందిస్తారన్నది మరోసారి నిరూపితమైంది. రాష్ట్రంలో వివిధ వర్గాల నుంచి తనకు అందుతున్న ఫిర్యాదుల్ని ఇప్పటికే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వేగంగా చర్యలు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్.. మరోసారి అలాంటిదే ఓ కీలక సమస్యపై వేగంగా స్పందించారు.
ఏపీలోని విజయనగరానికి చెందిన సూర్యకుమారి అనే మహిళ ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఓ ఫిర్యాదుతో కలిసింది. ఆమె ఇద్దరు కుమారుల్ని మానవ అక్రమ రవాణా ముఠా ఎత్తుకుపోయి మయన్మార్ సరిహద్దులకు తీసుకుపోయి బంధించిందని సూర్యకుమారి ఫిర్యాదు చేశారు. ఉద్యోగాల కోసం వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన తన కుమారుల్ని రక్షించాలని ఆమె పవన్ కళ్యాణ్ ను వేడుకుంది. దీంతో పవన్ వెంటనే స్పందించారు

మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్న తమ వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, వారిని విడిపించేందుకు సాయం చేయాలని సూర్యకుమారి వేడుకోవడంతో పవన్ కేంద్రాన్ని సంప్రదించారు. తమ ఇద్దరు కుమారులతోపాటు మొత్తం 8 మంది మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్నట్టు సూర్యకుమారి నుంచి అందిన ఫిర్యాదును విదేశీ వ్యవహారాలశాఖకు పంపారు. విదేశాంగశాఖ కూడా దీనిపై అంతే వేగంగా స్పందించింది.

మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కుకున్న వారిని రక్షించాలని పవన్ చేసిన విజ్ఞప్తిపై విదేశీ వ్యవహారాల శాఖ సానుకూలంగా స్పందించింది. విదేశాల్లో మగ్గుతున్న వారిని వెనక్కి తీసుకురావడానికి తమవంతు ప్రయత్నం చేస్తామని వెంటనే పవన్ కు హామీ ఇచ్చింది. దీంతో త్వరలోనే విదేశాంగశాఖ వీరిని వెనక్కి తీసుకొస్తుందని పవన్ సూర్యకుమారికి హామీ ఇచ్చి పంపారు. గతేడాది వచ్చిన పృధ్వీరాజ్ సుకుమారన్ సినిమా గోట్ లైఫ్ లోనూ ఇదే విధంగా గల్ఫ్ ఏజెంట్ల చేతుల్లో మోసపోయి అరబ్ దేశాల్లో ఆయన పడిన ఇబ్బందులు, చివరికి సుదీర్ఘ ఇబ్బందుల తర్వాత భారత్ కు వెనక్కి వచ్చిన తీరు అంతా చూశారు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications