Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చింతమనేని ప్రభాకర్‌పై పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్

ఏపీలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. పోలింగ్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో పార్టీ నేతలందరూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ విసృతంగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. బుధవారం గన్నవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్ స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ కుమార్తె పై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయన్నారు.

వంశీకి జనసేన శ్రేణులు ఓట్లు వేస్తే అవి మహిళను అగౌరపరిచే వారిని ప్రోత్సహించటం అవుతుందని వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన హనుమాన్ జంక్షన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చింతమనేని తనతో గొడవ పెట్టుకున్నారని పవన్ చెప్పుకొచ్చారు.అయినప్పటికీ చింతమనేని ప్రభాకర్ అంటే తనకి ఇష్టమని పవన్ స్పష్టం చేశారు.

Pawan Kalyan sensational comments on Chintamaneni Prabhakar

దెందులూరులో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నేనే గెలిపిస్తా అని చింతమనేని చెప్పటం నాకు చాలా ఆనందాన్ని కలిగించిందని పవన్ పేర్కొన్నారు.గొడవ పెట్టుకున్న వారే మంచి స్నేహితులు అవుతారని, వారి మధ్య విడదీయలేని బంధం ఏర్పడుతుంది.చింతమనేనితో గొడవ అందంగా ఉంటుంది.ప్రేమ ఉన్నచోటే గొడవ ఉంటుందంటూ అక్కడ ఉన్న వారిని పవన్ తన ప్రసంగంతో ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన పార్టీని చింతమనేని ఘోరంగా అవమానించారు.

పవన్ కల్యాణ్ ఉన్నాడని మేము గెలవలేదని.. మా సొంతంగా గెలిచామని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అన్నను గెలిపించుకోలేనోడు మమ్మల్ని గెలిపించడం ఏంటంటూ పవన్‌ను చింతమనేని గతంలో ఎద్దెవా చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఘోరంగా ఓడిపోవడం.. రాష్ట్రంలో పరిస్థితులు జగన్‌కు అనుకూలంగా మారడంతో..తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈక్రమంలోనే చింతమనేని ప్రభాకర్‌కు మద్దతుగా పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+