పవన్ షిప్ సీజ్ ఆదేశాలు చెల్లవా? కస్టమ్స్ కే అధికారం-ఆ హైకోర్టులో బంతి?

కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్ ను కలెక్టర్ షగిలి షన్మోహన్ సముద్రంలో పట్టుకున్న రెండు రోజుల తర్వాత అక్కడికి వెళ్లి దాన్ని సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలు చెల్లవా ? తనకు లేని అధికారాన్ని ఆపాదించుకుని పవన్ ఈ ఆదేశాలు ఇచ్చారా ? పవన్ ఆదేశాలను ఇప్పుడు పాటించే పరిస్దితి లేక ప్రభుత్వం ఇరుకునపడిందా ? ఇప్పుడేం చేయబోతోంది ? కాకినాడ పోర్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది.

కాకినాడ పోర్టులో సౌతాఫ్రికాకు చెందిన స్టెల్లా ఎల్ 1 నౌకలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారనే కారణంతో దాన్ని సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. అయితే సముద్ర రవాణా ప్రభుత్వ పరిధిలోకి రాదు. అందులో స్మగ్లింగ్ జరిగితేనే దాన్ని సీజ్ చేసే అధికారం మాత్రమే ప్రభుత్వ అధికారులకు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ పట్టుకున్న రేషన్ బియ్యం రవాణా స్మగ్లింగ్ కిందకు రాదని అధికారులు చెప్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఈ షిప్ ను సీజ్ చేసే పరిస్దితి లేదని అర్ధమవుతోంది.

pawan kalyan s ship seize order invalid only customs has right to approach admiralty court soon

ఇలాంటి పరిస్దితుల్లో ఆ షిప్ ను వదిలేయాలా లేక మరేదైనా చర్యలు తీసుకోవాలా అన్న మీమాంసలో పడిన అధికారులు, కాకినాడ పోర్టు యాజమాన్యం.. చివరికి నో డ్యూ సర్టిపికెట్ ఇవ్వకుండా ప్రస్తుతానికి దాన్ని అడ్డుకుంది. అయితే ప్రత్యామ్నాయ చర్యల విషయంలో ప్రభుత్వం అడ్మిరాలిటీ కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్దితి కనిపిస్తోంది. దీంతో పౌరసరఫరాలశాఖ ఆ మేరకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ ఆడ్మిరాలిటీ కోర్టు అంటే ఏంటి? మామూలు కోర్టులకూ దీనికి తేడా ఏంటి?

సముద్రంలో తలెత్తే వివాదాలకు సంబంధించిన కేసుల్ని పరిష్కరించేందుకు చట్టంలోని సెక్షన్ 2(1)(ఇ) ప్రకారం సాధారణ కోర్టుల్లో ఎంపిక చేసిన వాటికి అడ్మిరాల్టీ అధికారం కల్పించారు. ఇలా అడ్మిరాల్టీ కోర్టు అధికార పరిధిని కలిగి ఉన్న హైకోర్టుల జాబితాలో కలకత్తా, బొంబాయి, మద్రాస్, కర్ణాటక, గుజరాత్, ఒరిస్సా, కేరళ, హైదరాబాద్‌లతో సహా భారతదేశంలోని ఎనిమిది హైకోర్టులు ఉన్నాయి.ఇవన్నీ సముద్ర సంబంధ దావాలకు సంబంధించి హైకోర్టుల అధికార పరిధి, వాటి సంబంధిత అధికార పరిధిలోని ప్రాదేశిక జలాల్లో వివాదాల్ని పరిష్కరిస్తాయి. ఇప్పుడు ఈ కోర్టుకు వెళ్తి ఆ షిప్ వ్యవహారం తేల్చాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+