తలుచుకుంటే భయంగా - అలాగైతే పార్టీలోకి రావద్దు : పవన్ కళ్యాణ్..!!

తనకు వ్యక్తిగత ఆశలు.. భవిష్యత్ పై భయాలు లేవన్న పవన్.. రాబోయే తరాలను, వారి భవిష్యత్తును తలుచుకుంటే భయంగా ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పదవి వెతుక్కుంటూ రావాలే గానీ దాని వెంట పడకూడదన్నారు. పార్టీ కార్యాలయంలో జనసేన ఐటీ ప్రతినిధుల ముగింపు సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పదవి అనేది ప్రయాణంలో భాగంగా రావాలని అభిప్రాయపడ్డారు. అద్భుతాలు జరుగుతా యని తాను పార్టీ పెట్టలేదని తేల్చి చెప్పారు.

ఎన్నో అనుభవాలు సంపాదించాము

ఎన్నో అనుభవాలు సంపాదించాము

జాతీయ సమగ్రతాభావం కోల్పోకుండా మనందరం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్ వివరించారు. గత దశాబ్దన్నర కాలంలో ఎన్నో అనుభవాలు సంపాదించినట్టు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో పోంజీ స్కీమ్‌లను నడిపిస్తోన్న వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయాలని పవన పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలకు జనసేన పార్టీ వ్యతిరేకం కాదని.. సంక్షేమం పేరుతో అభివద్ధిని విస్మరించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తుందని పవన్ స్పష్టం చేసారు.

ఒక ఎలక్షన్‌ కోసమైతే పార్టీలోకి రావొద్దంటూ

ఒక ఎలక్షన్‌ కోసమైతే పార్టీలోకి రావొద్దంటూ


ఒక ఎలక్షన్‌ కోసమైతే పార్టీలోకి రావొద్దని పవన్ స్పష్టం చేసారు. ఒక తరానికి బాధ్యత గుర్తు చేయడానికి, మరో తరాన్ని మేల్కొల్పడానికి జనసేన పార్టీని స్థాపించానని వెల్లడించారు. అతి త్వరలో ఏపీలో శ్రీలంక పరిస్థితులు రావొచ్చని.. అక్కడ వరకూ రాకూడదనే కోరుకుంటున్నానని పవన్ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ఏ ఒక్కరూ బయటకు వలస వెళ్లే పరిస్థితి ఉండదన్నారు. ఐటి పరిశ్రమను ఇక్కడే అభివద్ధి చేస్తామని పవన్‌ అన్నారు. అనుభవం లేకుండా పదవులు వస్తే.. వైసీపీ ప్రభుత్వం మాదిరి ఉంటుందని పవన్‌ ఎద్దేవా చేశారు.

మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారు

మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారు


రాజకీయంగా చాలా నలగాలన్న జనసేనాని.. గత దశాబ్దన్నర కాలంలో ఎన్నో అనుభవాలు సంపాదించినట్టు చెప్పారు. ప్రజల ఆశలతో ఆటాడి.. మభ్యపెట్టి.. ఇష్టారీతిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మద్యపాన నిషేధం, ఉపాధి కల్పన, సీపీఎస్‌ రద్దు వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారని దుయ్యబట్టారు. ఇలాంటి ప్రభుత్వంపై స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తనకు వ్యక్తిగత ఆశలు.. భవిష్యత్ పై భయాలు లేవని స్పష్టం చేసారు. ప్రజలకు తనవంతుగా ఏదైనా చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+