మహిళా డాక్టర్ పై బూతు పురాణం ? జనసేన ఇన్ ఛార్జ్ పై పవన్ వేటు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందులో భాగస్వామి అయిన జనసేన పార్టీ నేతలపై ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అధికారం అండ చూసుకుని క్షేత్రస్దాయిలో రెచ్చిపోతున్న జనసేన నేతల సంఖ్య పెరుగుతోంది. ఇదే క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళా డాక్టర్ అని కూడా చూడకుండా రెచ్చిపోయిన ఓ జనసేన ఇన్ ఛార్జ్ పై పవన్ కళ్యాణ్ వేటు వేశారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇన్ ఛార్జ్ గా ఉన్న వరుపుల తమ్మయ్య బాబు తన ప్రాంతంలోని యువకులు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వారిని పరామర్శించేందుకు వెళ్లిన తన అనుచరుడు ఆయనకు పోన్ చేశాడు. దీంతో డాక్టర్ కు ఫోన్ ఇమ్మని తమ్మయ్య బాబు కోరాడు. ఆయన ఫోన్ ఇవ్వగానే బాధితులకు ట్రీట్ మెంట్ ఇస్తున్న డాక్టర్ ఆయన ఎవరో తెలియదంటూ మాట్లాడలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తమ్మయ్య బాబు ఆస్పత్రికి చేరుకుని ఆమెపై బూతు పురాణం అందుకున్నారు.

తానెవరో తెలియదంటారా అంటూ తమ్మయ్యబాబు మహిళా డాక్టర్ శ్వేతపై రెచ్చిపోయారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉద్యోగాలు చేయాలని సూచించారు. ప్రజల సొమ్ము తీసుకుని ఉద్యోగాలు చేస్తున్నారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ తతంతం వీడియో తీస్తున్న ఆస్పత్రి సిబ్బంది ఫోన్ తీసుకుని వీడియో డిలీట్ చేశారు. ఈ రచ్చకు నిరసనగా ఆస్పత్రిలో సిబ్బంది విధులు బహిష్కరించారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకూ వెళ్లడంతో తీవ్రంగా స్పందించారు. తమ్మయ్యబాబును బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications