సిఎం పదవి కంటే: పవన్, ఆ స్పీడ్ చూసి జనసేనలో చేరేందుకు ఆలోచించా: ముత్తా

కాకినాడ: అభిమానుల గుండెల్లోని ప్రేమ కంటే తనకు ముఖ్యమంత్రి పదవి ఏమాత్రం పెద్దది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన తనయుడు పార్టీలో చేరిన అనంతరం శనివారం మాట్లాడారు.

ఏదో లబ్ధి పొందాలని తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. త్రికరణ శుద్ధిగా పని చేయాలనే వచ్చానని అన్నారు. రాజకీయాల్లో పరిపూర్ణ అవగాహన ఉన్న ముత్తా గోపాలకృష్ణ పార్టీలోకి రావడం హర్షదాయకమన్నారు.

అల్లూరి, భగత్ సింగ్ స్థాయికి పవన్ కళ్యాణ్

అల్లూరి, భగత్ సింగ్ స్థాయికి పవన్ కళ్యాణ్

అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్‌ స్థాయికి పవన్ కళ్యాణ్‌ ఎదిగారని ముత్తా అన్నారు. పవన్‌ ఆశయాలకు అనుగుణంగా జనసేనలో పని చేస్తానని చెప్పారు. ఏమీ ఆశించకుండా సమాజంలో మార్పుకోసం జనసేన కార్యకర్తల తపిస్తున్నారన్నారు. పవన్ వివేకానందునిలా జనసేన కార్యకర్తల శక్తి, ఉత్సాహం, ఆవేశం, ఆగ్రహం అన్నింటినీ సమాజాభివృద్దికి వినియోగించాలని ఆకాంక్షించారు.

అందుకే రాజకీయాల్లోకి జనసేనాని

అందుకే రాజకీయాల్లోకి జనసేనాని

ఏదో మార్పుతేవాలన్న తపనతో జనసేన అధినేత రాజకీయాల్లోకి వచ్చారని, ఆయనకు తన మద్దతు ఎపుడూ ఉంటుందని చెప్పారు. తనపై ఎంతో నమ్మకంతో జనసేనాని పెద్ద బాధ్యత అప్పగించారని చెప్పారు. పవన్‌ లాంటి అనుభవజ్ఞులు జనసేనకు కావాలన్నారు. జనసేన కార్యకర్తల స్పీడు తలుచుకుని తాను మొదట చేరేందుకు సంశయించానన్నారు. మీరు నడవకుంటే మా కార్యకర్తలు మిమ్మల్ని ఎత్తుకెళ్తారన్నారు. పవన్‌ ఇచ్చిన భరోసాతో చేరేందుకు అంగీకరించానని నవ్వుతూ చెప్పారు.

పవన్ ఆవేశపరుడు అనుకున్నా కానీ

పవన్ ఆవేశపరుడు అనుకున్నా కానీ

సినిమాల్లో పవన్‌ను చూసి చాలా ఆవేశపరుడని అనుకున్నానని, కానీ తొలిసారి ఆయనను కలిసినపుడు ఆయన సంస్కారం, ఆయన మేధస్సు, ప్రజల కోసం ఆయన పడే తపనతో గొప్ప వ్యక్తిగా, మనసున్న మారాజుగా అర్ధం చేసుకున్నానని చెప్పారు. పవన్‌ ఇప్పటికే భగత్‌సింగ్‌, అల్లూరిసీతారామారాజు స్థాయికి ఎదిగిపోయారని, సమాజానికి దేశానికి ఉపయోగపడేలా పవన్‌ ఉన్నారన్నారు. ఏం ఆశించకుండా ఎలాంటి త్యాగాలకైనా సిద్దపడి నాడు స్వాతంత్య్రపోరాటం సాగితే ఇపుడు సమాజంలో మార్పుకోసం, స్వచ్చ రాజకీయాల కోసం జనసేన ఊగిపోతోందన్ననారు.

మార్పు నమ్మకం ఉంది

మార్పు నమ్మకం ఉంది

సమాజంలో మార్పును పవన్‌ నాయకత్వంలో జనసేన తీసుకువస్తుందన్న విశ్వాసం తనకుందన్నారు. పవన్‌ అభిప్రాయాలు, ఆలోచనలు చాలా ఉన్నతమైనవన్నారు. జనసేనకు ఏ మూలకు వెళ్ళినా అపూర్వస్పందన కనబడుతోందని, జనసేన అధినేత కోరుకున్నవిధంగా, ఆశించిన విధంగా తాను సేవలందిస్తానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+