పవన్ దెబ్బ: ఏపీలో పొలిటికల్ హీట్, జనసేనాని దూకుడు, ఏం జరుగుతోంది?
అమరావతి: జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్‌తో పాటు కొందరు మీడియా సంస్థల అధినేతలను లక్ష్యంగా చేసుకొని ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. సినీ పరిశ్రమను కుదిపేసిన శ్రీరెడ్డి వ్యవహారం వెనుక అధికార పార్టీ నేతలున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. అయితే ఈ విషయమై ఎవరూ కూడ వ్యాఖ్యానించొద్దని కూడ టిడిపి నాయకత్వం పార్టీ శ్రేణులను ఆదేశించింది.
Recommended Video

సినీ పరిశ్రమను కుదిపేసిన శ్రీరెడ్డి వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. శ్రీరెడ్డి వెనుక ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఉన్న విషయాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గురువారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో ఉన్న సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్‌కు అల్లు అరవింద్ సూచించారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దీక్ష ప్రారంభ సమయానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి వ్యవహరం వెనుక ఏపీ మంత్రి నారాలోకేష్ అతని స్నేహితుడు రాజేష్ ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో పెరిగిన హీట్
ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని సృష్టించాయి. శ్రీరెడ్డి వ్యవహరం వెనుక మంత్రి నారా లోకేష్‌తో పాటు ఆయన స్నేహితుడు రాజేష్‌లు ఉన్నారని చెప్పారు. అంతేకాదు ఈ విషయమై కొన్ని మీడియా సంస్థలు కూడ టిడిపికి అనుకూలంగా పనిచేశాయని ఆరోపించారు. చంద్రబాబునాయుడు దీక్ష రోజునే పవన్ కళ్యాణ్ ఈ మేరకు చేసిన సంచలన ట్వీట్ ఆసక్తిని రేకేత్తిస్తోంది. నెల రోజులుగా టిడిపిపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరుగుతున్నారు. టిడిపి నేతలు కూడ పవన్ కళ్యాణ్ విమర్శలపై ఎదురు దాడికి దిగుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు తెరతీశాయి. అయితే ఈ చర్చ ఏ మేరకు రాజకీయాలపై ప్రభావం చూపుతోందనే విషయాన్ని ఇప్పటికిప్పుడే చెప్పలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పవన్ కామెంట్స్‌పై మౌనంగా టిడిపి
పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి టిడిపి నేతలు మౌనమే మేలని భావిస్తున్నారు. ఈ విషయమై ఎవరూ కూడ మాట్లాడకూడదని పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తమను అప్రతిష్టపాలు చేసేందుకు ఉద్దేశించిందని టిడిపి నాయకత్వం భావిస్తోంది. ఈ తరుణంలో ఈ వ్యాఖ్యలపై దీక్ష తర్వాత ఆ పార్టీ నాయకత్వం నోరు తెరుస్తోందా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తిని కల్గిస్తోంది. అయితే దీక్ష నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేశారని టిడిపి నాయకత్వం అనుమానిస్తోంది .

టిడిపిపై దూకుడు పెంచిన పవన్
గత నెలలో గుంటూరులో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ టిడిపిపై విమర్శలను ప్రారంభించారు. ఈ సభలో ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కూడ ఇదే తరహా విమర్శలను చేశారు. ఏపీ ప్రభుత్వం తనకు కేటాయించిన గన్‌మెన్లను కూడ పవన్ కళ్యాణ్ మూడు రోజుల క్రితం వెనక్కి పంపారు. శ్రీరెడ్డి వ్యవహరం వెనుక టిడిపి ఉందని పవన్‌కళ్యాణ్ ఆరోపణలు చేయడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఏడాదికి ముందే ఏపీలో ఎన్నికల వాతావరణం
ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. అయితే ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కన్పిస్తోంది. అధికార టిడిపి, విపక్ష వైసీపీతో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి అయితే ప్రత్యేక హోదా విషయమై పార్టీలు ఏదో ఒక రూపంలో పోరాటాలను చేస్తున్నాయి. తాజాగా సినీ పరిశ్రమకు చెందిన శ్రీరెడ్డి వ్యవహరం కూడ రాజకీయాలకు లింకు ఉందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.శ్రీరెడ్డి వ్యవహరం వెనుక ఏపీ మంత్రి లోకేష్ ఉన్నట్టు చేసిన ఆరోపణలు రాజకీయరంగును పులుముకొన్నాయి.
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications