ఉగాదినాడు గత వైసీపీ పాలనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు వాళ్ళు అత్యంత ఘనంగా జరుపుకునే ఉగాది పండుగ వాడవాడలా షడ్రుచులను ఆస్వాదిస్తూ ఘనంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా ఉగాది వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భగవంతుడు మంచి భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటున్నట్టు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్
ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు తాను ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. భారత్ అగ్రస్థానంలో ఉంటే వారందరని లీడ్ చేసే శక్తి తెలుగు ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఉగాది పండుగ నాడు పవన్ కళ్యాణ్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

పవన్ కళ్యాణ్ ఆసక్తికర పోస్ట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా గత ప్రభుత్వ పాలన పైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. జీవితం కష్టసుఖాల సమ్మేళనమని మన ఉగాది పచ్చడిని అందుకు సంకేతంగా భావిస్తామని తెలిపారు. పండుగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు, కళలు జాతిని సజీవంగా నిలుపుతాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
తెలుగు ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం తెలుగు లోగిళ్లను సిరిసంపదలతో పచ్చగా ఉంచాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 29, 2025
- @PawanKalyan pic.twitter.com/dDjX5Si1Nt
గత ప్రభుత్వ పాలనపై పవన్ కళ్యాణ్
మన ముంగిటకు వచ్చిన ఉగాది తెలుగువారి వారసత్వ పండగ అంటూ ఆయన కొనియాడారు. ఇక ఇదే సమయంలో గత ప్రభుత్వ పాలన పైన విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ పాలన కష్టాల మయంగా ఉందన్నారు. ఇప్పుడు ప్రజలకు సుఖాలను అందించే మంచి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ముంగిటకు వచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
తెలుగు లోగిళ్ళు సిరిసంపదలతో ఉండాలని ఆకాంక్ష
తమ ప్రభుత్వ హయాంలో సుపరిపాలన సాగుతుందన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. చైత్రమాసపు శోభతో వసంతాన్ని మోసుకు వచ్చిన విశ్వావసు నామ ఉగాది తెలుగు లోకిళ్లను సిరిసంపదలతో పచ్చగా ఉంచాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో వెల్లడించారు.












Click it and Unblock the Notifications