ఛాన్స్ మిస్ చేసుకోవద్దు - పవన్ 'మెగా' డెసిషన్..!!
డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి విజయం లో ఉభయ గోదావరి జిల్లాలు కీలక పాత్ర పోషించాయి. అధికారంలో ఉన్న పవన్ తమ కుటుంబానికి మూలం అయిన మొగల్తూరుకు భారీ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేసే సమయంలోనూ సొంత ఊరుకు ఏం చేయలేదంటూ నాడు విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పవన్ డిప్యూటీ సీఎం హోదాలో మొగల్తూరు కు వెళ్తున్నారు. కీలక ప్రకటనలకు సిద్దం అయ్యారు. తమకు వచ్చిన ఛాన్స్ సద్వినియోగం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
మొగల్తూరులో పవన్
డిప్యూటీ సీఎం పవన్ ఈ నెల 27న మొగల్తూరులో పర్యటించనున్నారు. మొగల్తూరు కి మెగా ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు ఆ గ్రామానికి తన మార్క్ నిర్ణయాలతో చిరకాలం గుర్తించేలా కొత్త కార్యక్రమాలకు పవన్ శ్రీకారం చుట్టనున్నారు. స్థానికంగా గ్రామ ప్రజల సమస్య లను అడిగి తెలుసుకొని, అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలిస్తారు. మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, నీటి సరఫరా, విద్యుత్ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అదే విధంగా సాయంత్రం పెనుగొండలో మరో గ్రామ సభను నిర్వహించనున్న పవన్ కళ్యాణ్, ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి అవసరాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయనున్నారు.

కొత్త ప్రణాళికలు
చిరంజీవి 2009 లో ప్రజారాజ్యం నుంచి పాలకొల్లు అభ్యర్దిగా పోటీ చేసారు. ఆ సమయంలో సొంత గ్రామానికి చిరంజీవి ఏం చేయలేదంటూ నాడు సీఎం హోదాలో వైఎస్సార్ ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేసారు. సొంత గ్రామానికి ఏం చేయని వారు.. రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. కాగా, ఆ ఎన్నికల్లో పాలకొల్లు నుంచి చిరంజీవి ఓడిపోయారు. తిరుపతి నుంచి గెలుపొందారు. ఇక,
ఇక.. ఇప్పుడు పవన్ గ్రామీణాభివృద్ధి - పంచాయితీ రాజ్ శాఖను పర్యవేక్షిస్తున్నారు. దీంతో, తనకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ మొగల్తూరు లో అభివృద్ధిని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో వివిధ శాఖల అధికారులను పిలిచి సమీక్ష చేయనున్నారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అనే అంశంపైనా చర్చించనున్నారు.
రోల్ మోడల్ గా
మొగల్తూరుతో పాటుగా సమీప గ్రామాల్లో అభివృద్ధి దిశగా నిర్ణయాలు ప్రకటించనున్నారు. నాడు ప్రజారాజ్యం.. ఇప్పుడు జనసేనకు ఈ గ్రామాలు పూర్తి మద్దతుగా నిలుస్తున్నాయి. స్థానికులతో కలిసి గ్రామాలకు కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి చర్చిస్తారు. ఆయా పనులు జరిగేలా ఆయన అధికారులకు అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోనున్నారు. మొగల్తూరును రూల్ మోడల్ గా తీర్చి దిద్దేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ ప్రతీ నియోజకవర్గంలోనూ పర్యటిస్తానని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ముందుగా మొగల్తూరు లో ఈ పర్యటన ద్వారా మెగా ఇమేజ్ పెంచటంతో పాటుగా ప్రభుత్వం నుంచి చేయాల్సిన పనుల పైన పవన్ ఇప్పుడు తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications