జగన్-పవన్‌లు తొలిసారి ఇలా..: హడావుడిగా వెళ్లిన జనసేనాని, ఇరకాటంలో బాబు
హైదరాబాద్: ఏపీలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ, బీజేపీ, వైసీపీలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సోమవారం రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు పవన్-జగన్‌లు నేరుగా ఘాటైన సవాళ్లు చేసుకున్న సందర్భాలు లేవని చెప్పవచ్చు.
Recommended Video

కానీ, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయంలో మాత్రం పవన్, జగన్‌లు నేరుగా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. అవిశ్వాస తీర్మానం అంశాన్ని పవన్ కోర్టులోకి నెట్టుదామని జగన్ అనుకుంటే జనసేనాని తిరిగి వైసీపీ కోర్టులోకి నెట్టి వేశారు. ఓ విధంగా వైసీపీని ఇరుకున పడేశారు.
చదవండి: జగన్ సవాల్‌కు వెనుకంజ: అవిశ్వాసంపై ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్య, మోడీపై మళ్లీ

జగన్‌తో పాటు చంద్రబాబు ఇరుకున
వైయస్ జగన్‌కు దమ్ముంటే కేంద్రంపై ఎదురు తిరగాలని పవన్ కళ్యాణ్ సవాల్ చేశారు. మార్చి 4న తాను ఢిల్లీకి వస్తున్నానని, మార్చి 5న వైసీపీ ఎంపీలు అవిశ్వాసంతో పార్లమెంటులో అడుగు పెట్టాలని సవాల్ చేశారు. ఈ విషయంలో జగన్ ఇరుకున పడ్డారని చెప్పవచ్చు. అదే సమయంలో చంద్రబాబును కూడా పవన్ ఇరుకునపడేశారని చెప్పవచ్చు.

జగన్‌తో పాటు ఇరుకునపడ్డ బాబు
జగన్ అవిశ్వాస తీర్మానం పెడితే తెలుగుదేశం పార్టీ వైఖరి కూడా తెలుస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ వెనుకంజ వేసినప్పటికీ.. వైసీపీ నిజంగానే దానిని పెడితే అప్పుడు చంద్రబాబు కూడా ఇరుకున పడతారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం లేదా ఏపీ ప్రయోజనాల కోసం వైసీపీ అవిశ్వాసం పెడితే టీడీపీ మద్దతివ్వకుంటే చంద్రబాబును తప్పుబట్టే పరిస్థితి వస్తుంది.

జగన్ సవాల్, చంద్రబాబు వెనక్కి
ఇదిలా ఉండగా, పవన్, జగన్‌లు గట్టి సవాళ్లు చేసుకోవడం ఇదే ప్రథమం అని చెప్పవచ్చు. ప్రత్యేక హోదా లేదా ఏపీ ప్రయోజనాలపై వైసీపీ, టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసం పెట్టవచ్చు కదా అని పవన్ రెండు రోజుల క్రితం ప్రకటించగా, వెంటనే జగన్ స్పందించారు. చంద్రబాబు మాత్రం వెనక్కి పోయారు. దీంతో పవన్ సోమవారం మీడియా ముందుకు వచ్చి జగన్ సవాల్‌కు ప్రతి సవాల్ విసిరారు.

హడావుడిగా వెళ్లిపోయిన పవన్
పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో కేవలం అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడి ఆ తర్వాత హడావుడిగా వెళ్లిపోయారు. ఆయన ముందే కేవలం జగన్ సవాల్ పైన మాట్లాడాలని నిర్ణయించుకొని వచ్చినట్లుగా ఉంది.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications