పవన్ వర్సెస్ వైసీపీ పోరు-బీజేపీ-టీడీపీలకు సంకటం! విడాకులు తప్పకపోతే కొత్త సమీకరణమిదే ?

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరుకు విపక్షాలు కదులుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని కలుపుతానన్న పవన్ కళ్యాణ్ ఆ దిశగానే అడుగులేస్తున్నారు. గతంలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఈసారి ఉమ్మడి పోరుతోనే వైసీపీని గద్దెదించగలమని భావిస్తున్న పవన్ .. ఈ క్రమంలో తమ మిత్రపక్షం బీజేపీకి సైతం చుక్కలు చూపిస్తున్నారు. వైసీపీతో పోరులో కలిసొస్తే సరి.. లేకుంటే మిమ్మల్ని వదులుకునేందుకు సైతం సిద్ధమంటున్నారు. పవన్ దూకుడు చంద్రబాబులోనూ కలవరం పుట్టిస్తోంది.

పవన్ కళ్యాణ్ తాజా వ్యూహాలు

పవన్ కళ్యాణ్ తాజా వ్యూహాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో తాజాగా మార్పుకనిపిస్తోంది. గతంలో చేసిన ముతక రాజకీయాల్ని వదిలేస్తూ, విపక్షాల్ని కలుపుకుంటూ అధికారపక్షం వైసీపీపై ఉమ్మడి పోరుకు ఆయన రంగం సిద్దం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పోరులో కలిసొచ్చే పక్షాలపై ఇప్పుడే క్లారిటీ తెచ్చేస్తున్నారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా ఆ లోపే ఈ పోరును ప్రారంభించడం ద్వారా ఎన్నికల నాటికి సర్వశక్తులొడ్డేందుకు అవసరమైన అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో ఆలోపే తెలంగాణలో అసెంబ్లీ పోరు కోసం మరో వ్యూహం పన్నుతున్న బీజేపీ-టీడీపీ ఇరుకునపడే పరిస్దితి కనిపిస్తోంది.

బీజేపీకి పవన్ డెడ్ లైన్ ?

బీజేపీకి పవన్ డెడ్ లైన్ ?

వైసీపీపై ఉమ్మడి పోరు కోసం వ్యూహరచన చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఈ పోరులో కలిసొచ్చే టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్ వంటి పార్టీలతో జత కట్టే దిశగా ముందుకు సాగుతున్నారు. అలాగే ఈ పోరులో కలిసొచ్చేందుకు సిద్ధపడితే బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. లేకపోతే మాత్రం బీజేపీని వదిలేసి మరీ ఇతర పార్టీలతో వైసీపీపై పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీకి డెడ్ లైన్ కూడా ఇచ్చేశారు. రోడ్ మ్యాప్ ఇస్తారా లేక తమ దారి చూసుకోమంటారా అంటూ పవన్ సంధిస్తున్న బాణం ఇప్పుడు కాషాయ సేనను డైరెక్ట్ గానే తాకుతోంది. దీంతో ఢిల్లీ పెద్దలు కూడా కదులుతున్నారు.

బీజేపీ-టీడీపీలకు సంకటం ?

బీజేపీ-టీడీపీలకు సంకటం ?

పవన్ దూకుడుతో ఆయనతో పొత్తు కోసం ఎదురుచూస్తున్న బీజేపీ-టీడీపీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు బీజేపీతో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. ఏపీలో బీజేపీతో పొత్తు లేకపోయినా మిగతా పార్టీల్ని కలుపుకుని ముందుకెళ్లేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. దీంతో బీజేపీకి మాత్రమే నష్టం. కానీ ఈ సమీకరణంతో తెలంగాణలో బీజేపీ పొత్తుతో వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని, తద్వారా 2024 ఎన్నికల్లో ఏపీలోనూ బీజేపీ సాయం తీసుకోవాలని ఎదురుచూస్తున్న చంద్రబాబుకు మాత్రం ఇబ్బంది తప్పేలా లేదు.

 తెరపైకి కొత్త సమీకరణాలు ?

తెరపైకి కొత్త సమీకరణాలు ?

ఏపీలో వైసీపీతో సత్సంబంధాల పేరుతో ఉమ్మడి పోరుకు బీజేపీ కలిసి రాకపోతే మాత్రం బీజేపీని వదిలేసి మిగతా పార్టీలతో ముందుకెళ్లేందుకు పవన్ రెడీ అవుతున్నారు. అదే సమయంలో ఏపీలో తమతో పొత్తుకు సిద్ధంగా ఉన్న టీడీపీ.. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అభ్యంతరాలు చెప్పకూడదనే భావనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడు ఏపీలో వైసీపీ-బీజేపీయేతర పార్టీలతో జనసేన పొత్తు ఉంటే, తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి జట్టు కట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఈక్వేషన్ పైనే ఇప్పుడు బీజేపీ అధిష్టానం కూడా వర్కవుట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అతి త్వరలోనే క్లారిటీ లభిస్తుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+