పవన్ కళ్యాణ్ చేతి వేళ్లకి విశిష్టమైన ఆ రెండు ఉంగరాలు: అధికార యోగం!
హైదరాబాద్: చాలా మంది తమ చేతికి కొన్ని ఉంగరాలు ధరిస్తే తమ జాతకం మారిపోతుందని నమ్ముతుంటారు. ఎక్కువగా ఈ ఉంగరాలు పెట్టుకుంటే మంచి జరుగుతుంది. అన్ని విధాలా కలిసివస్తుందని భావిస్తారు. ఇలా ఎక్కువగా నమ్మేవారిలో రాజకీయ నాయకులే ముందుంటారు. తాజాగా, ఈ జాబితాలో ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేరిపోయారు.
ఆధ్యాత్మికచింతన కలిగిన పవన్ కళ్యాణ్.. తాజాగా తన చేతికి రెండు ఆకర్షణీయమైన ఉంగరాలు ధరించి కనిపించారు. దీంతో ఈ ఉంగరాలపై అటు సినిమా, ఇటు రాజకీయ పరంగానూ చర్చ జరుగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వచ్చిన తర్వాత నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్.

ఈ సందర్భంగా ఆయన చేతి వేళ్లకు ఉన్న ఉంగరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ రెండు ఉంగరాల్లో ఒకటి నాగ బంధం, మరొకటి కూర్మావతారం కావడం విశేషం. ఈ రెండు బంగారు ఉంగరాలు.. చాలా పెద్ద సైజులో ఉన్నాయి. కాగా, ఈ ఉంగరాలు ధరిస్తే వచ్చే వచ్చే ప్రయోజనాలేంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, నాగ బంధం, కూర్మావతారం ఉంగరాలకు మంచి విశిష్టత ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ప్రయోజనాలు కలుగుతాయని కూడా అంటున్నారు.
నాగ బంధం ఉంగరం విషయానికొస్తే.. నాగుపాము ఆకారంలో ఉండే నాగబంధం ఉంగరం వల్ల అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే.. తొలగిపోతాయి. అనుకోని విపత్తులు, గండాల నుంచి రక్షిస్తుంది. అలాగే ఎలాంటి దుష్ట శక్తులు మనపై పడకుండా ఈ ఉంగరం కాపాడుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాక, రాహు కేతు దోషాలు, నరదిష్టి దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే, ఎవరుపడితే వాళ్లు నాగ బంధం ఉంగరాలు ధరించకూడదని.. జోతిష్యం ఆధారంగానే ధరించాల్సి ఉంటుందని అంటున్నారు.
ఇక కూర్మావతారం ఉంగరం ప్రయోజనాల విషయానికొస్తే.. ఈ ఉంగరం ధరించడం వల్ల అధికార, ధన యోగం సిద్ధిస్తుందనేది విశ్వాసం. అధికార యోగం రావాలంటే దైవబలం కావాలని ఆకాంక్షించేవారు.. ఇలాంటి కూర్మావతారం(తాబేలు) ఉంగరాలు ధరిస్తారని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. ఎలాంటి దోషాలు లేకుండా అధికార యోగం కోరుకోవడం వల్లే పవన్ కళ్యాణ్ ఈ రెండు విశిష్టమైన ఉంగరాలు ధరించివుంటారని పండితులు చెబుతున్నారు. ఏది ఏమైనా వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అసలు విషయం తేలిపోయే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.
-
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! -
ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ రిలీజ్.. -
'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ షో టైమ్ లీక్.. ఇక రచ్చ రచ్చే.. -
"ఉస్తాద్ భగత్ సింగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో వాహనదారులకు పోలీసుల అలర్ట్ ! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్











Click it and Unblock the Notifications