లోకేష్ పాదయాత్ర సభ పోస్టర్‌లో పవన్ ఫొటో మిస్సింగ్: జనసేనతో పొత్తుపై టీడీపీ పునరాలోచన..?!

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో సాగుతోంది. యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా ఆయన విశాఖపట్నం జిల్లాలో అడుగుపెట్టాల్సి ఉంది. జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఆయన వెంట పాదయాత్రలో పాల్గొంటోన్నారు.

పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ స్థానికులను కలుసుకుంటోన్నారు. వారి నుంచి వినతిపత్రాను స్వీకరిస్తోన్నారు. ప్రజలతో ముఖాముఖి భేటీ అవుతున్నారు. మరో మూడు నెలల్లో తమ ప్రభుత్వం రాబోతోందనే ధీమాను వ్యక్తం చేస్తోన్నారు. ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లాలో పాదయాత్రను ముగించనున్నారు నారా లోకేష్.

జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అక్కడే పాదయాత్ర పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. విశాఖపట్నం, భీమిలి మీదుగా నారా లోకేష్ పోలిపల్లికి చేరుకుంటారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఈ సభకు హాజరు కానున్నారు.

Nara Lokesh

బహిరంగ సభ ఏర్పాట్లను టీడీపీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు, వెలగపూడి రామకృష్ణ బాబుతో పాటు బండారు సత్యనారాయణ మూర్తి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పార్టీ అధ్యక్షులు పరిశీలించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి భారీ ఎత్తున జనాన్ని సమీకరించడానికి టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది.

పాదయాత్ర ముగింపు సభ కోసం తెలుగుదేశం పార్టీ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటో మిస్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొన్నటివరకు వివిధ పత్రికలకు ఇచ్చిన అడ్వర్టయిజ్‌మెంట్లల్లో పవన్ కల్యాణ్ ఫొటోలను విస్తృతంగా వాడింది టీడీపీ.

Nara Lokesh

అత్యంత కీలకమైన పాదయాత్ర ముగింపు సభ పోస్టర్‌లో ఆయన ఫొటోను పెట్టకపోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఒక వైపు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు, మరోవైపు అచ్చెన్నాయుడు ఫొటోలను పెట్టారు. వాటి కింద చంద్రబాబు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ ఫొటోలను పెద్దగా ప్రచురించారు. బహిరంగ సభ వివరాలను పొందుపరిచారు.

మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ గానీ, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫొటోలు గానీ ఈ పోస్టర్‌లో లేవు. ఈ సభకు తాను హాజరు కావట్లేదంటూ పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన ఫొటోను తొలగించారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+