చిరంజీవి పుట్టినరోజు.. ఏపీ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. తెలుగు రాష్ట్రాలలో మెగాస్టార్ అభిమానులకు ఇది పండుగ రోజు. అయితే నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. అన్నయ్యతో తనకున్న అనుబంధాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను, ఆయన చేసిన త్యాగాలను గుర్తుచేస్తూ ఆయన చేసిన పోస్ట్ అందరికీ హార్ట్ టచ్చింగ్ గా అనిపించింది.

అన్నయ్యే ఏకైక హీరో తనకు అంటున్న ఏపీ డిప్యూటీ సీఎం

నా అన్నయ్యే నా ఏకైక హీరో అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వకంగా రాశారు. పవన్ కళ్యాణ్ తన పోస్టులో చిరంజీవి కాలేజీ చదువుల కోసం నర్సాపూర్ వెళ్లిన రోజులను గుర్తుచేసుకున్నారు. వేసవి సెలవులకు అన్నయ్య ఇంటికి వచ్చినప్పుడు ఇల్లంతా పండుగ వాతావరణం నిండిపోయేదని, తిరిగి కాలేజీకి వెళ్లినప్పుడు మాత్రం ఇల్లు ఖాళీగా, విషాదంగా అనిపించేదని రాశారు.

pawankalyan emotional post on chiranjeevi on his birthday calling him his only hero reminds his childhood memories

చిరంజీవిని చూసి తాను ఫ్యాన్‌ లా ఫీల్ అయ్యానన్న పవన్ కళ్యాణ్

స్కూల్ రోజుల్లో అన్నయ్య పక్కన నడవడమే తనకు గర్వకారణమని అనిపించేదని ఆయన పేర్కొన్నారు. తండ్రి బుల్లెట్ బైక్‌పై పొడవాటి జుట్టు, ఫిట్‌గా ఉన్న ఎన్‌సీసీ క్యాడెట్ శరీరం, బెల్ బాటమ్స్, కళ్లద్దాలతో కనిపించే చిరంజీవిని చూసి తాను ఫ్యాన్‌ లా ఫీల్ అయ్యేవాడిని అని గుర్తుచేశారు.

చిన్నప్పుడు తన కోసం చిరంజీవి తెచ్చినవి గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్

చిరంజీవి సినీ కెరీర్ ప్రారంభ దశలో తొలిసారి సింగపూర్ వెళ్లి వచ్చినప్పుడు పెద్ద నీలిరంగు బ్యాగ్ తీసుకొచ్చారని పవన్ వివరించారు. అందులో తన కోసం లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, రేసింగ్ ట్రాక్, కామిక్స్, మ్యూజిక్ క్యాసెట్లు, టేప్ రికార్డర్, యార్డ్లీ పౌడర్లు, సబ్బులు, పెర్ఫ్యూమ్స్ తో పాటు కుటుంబ సభ్యులకు చిన్నచిన్న బహుమతులు ఉన్నాయని చెప్పారు. చిరంజీవి ఇంట్లో ఎప్పుడూ ఆనందాన్ని, చిరునవ్వులను నింపేవారని పేర్కొన్నారు.

అన్న, వదినలు చూపించిన ప్రేమపై పవన్ కళ్యాణ్

అన్నయ్య పెళ్లి సమయంలో తాను దూరమైపోతారేమోనని బాధపడి ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్నానని పవన్ కళ్యాణ్ రాశారు. అప్పుడు చిరంజీవి భార్య సురేఖను తీసుకొచ్చి 'రా.. ఈరోజు నీకు ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తాను' అని చెప్పారని గుర్తుచేశారు. తర్వాత చెన్నైలో చిరంజీవి, సురేఖతో కలిసి ఉన్న రోజుల్లో వారిద్దరూ చూపించిన ప్రేమ, శ్రద్ధను మాటల్లో చెప్పలేనని అన్నారు.

చిరంజీవి కెరీర్ లో ఎదుర్కొన్న కష్టాలను చెప్పిన పవన్ కళ్యాణ్

చిరంజీవి సినీ కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలను కూడా పవన్ గుర్తుచేశారు. చెన్నైలోని వేడిలో రోజుకు 18గంటల పాటు షూటింగ్ చేసి, చెమటతో తడిసిన దుస్తులతో అర్ధరాత్రి ఇంటికి వచ్చేవారని నాడు చిరంజీవి పడిన కష్టాన్ని గుర్తు చేశారు. అలాంటి అలసటలో కూడా తన చదువు వైఫల్యాలు, జీవితంలో దిశ లేకపోవడం గురించి ఒక్కసారి కూడా మందలించలేదని పవన్ వెల్లడించారు. కుటుంబం, బంధువులు, స్నేహితులు, సినీపరిశ్రమ వారిని ఔదార్యంతో ఆదుకున్నారని కొనియాడారు.

హైదరాబాద్ లో భూగర్భ మెట్రో.. ఈ మార్గాలలోనే.. సక్సెస్ అయితే
హైదరాబాద్ లో భూగర్భ మెట్రో.. ఈ మార్గాలలోనే.. సక్సెస్ అయితే

నగరం ఎప్పుడూ నిద్రపోనట్లే ఆయన ఎప్పుడూ విశ్రాంతి తీసుకోరు

దక్షిణాది, హిందీ సినిమా మధ్య వారధిగా నిలిచిన చిరంజీవి ప్రయాణాన్ని, జాతీయ పురస్కారాలు, పద్మవిభూషణ్, కేంద్ర మంత్రి పదవి వంటి ఘనతలను ప్రస్తావించారు. ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత కూడా త్వరగా కోలుకుని స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నారని, 'ఒక నగరం ఎప్పుడూ నిద్రపోనట్లే ఆయన ఎప్పుడూ విశ్రాంతి తీసుకోరు' అని అన్నారు. చిరంజీవికి సంపూర్ణ ఆరోగ్యం, అపార శక్తి, మరెన్నో విజయాలు కలగాలని కోరుతూ 'జై హింద్' అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+