మార్కెట్లు డౌనైనా ఈ షేర్లు మాత్రం తగ్గేదేలే!

BSE మెటల్స్ సెక్టార్‌లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 30 పాయింట్లకుపైగా పెరిగింది. 63 వేల 350 మార్కు వద్ద కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ ఫ్లాట్‌గా 18 వేల 800 మార్కు వద్ద ట్రేడవుతోంది.

పవర్, టెలీ కమ్యూనికేషన్స్, క్యాపిటల్ గూడ్స్, రియల్ ఎస్టేట్ స్టాక్స్ మాత్రం నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. ఇక BSE నమోదిత షేర్లలో 1976 రాణించాయి. అదేక్రమంలో మరో 1273 షేర్లు పడిపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒక శాతానికి పైగా పెరిగింది. పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ స్టాక్ 12 శాతానికిపైగా పెరగడమే దీనికి కారణం. ఇక Xchanging Solutions స్టాక్ టాప్ bse స్మాల్ క్యాప్ గెయినర్‌గా నిలిచింది. 14 శాతానికిపైగా పుంజుకుంది.

 sharesup

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, లార్సెన్, హెచ్‌డీఎఫ్‌సీ లాభాల్లో ఉండగా.. టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, అపోలో హాస్పిటల్ షేర్లు క్షీణించాయి. మార్కెట్లు డౌనవుతున్నా రూపాయి షేర్లు మాత్రం లాభాల బాటలో కొనసాగుతున్నాయి. 5 పెన్నీ స్టాక్స్ అప్పర్‌ సర్క్యూట్ కొట్టాయి. భవిష్యత్తులో ఇవి పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని యాడ్ లిస్టులో చేర్చుకోవాలంటున్నారు. అవేంటంటే.. Escorts Finance Ltd, Picturehouse Media Ltd, Computer Point Ltd, trio Mercantile & Trading Ltd, Hiliks Technologies Ltd.

నిన్‌టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ (NINtec Systems Limited) ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఒక మల్టీబ్యాగర్ స్టాక్. 1ఏడాది వ్యవధిలోనే ఏకంగా 1500 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ కంపెనీ బోనస్ షేర్లను కూడా ఆమోదించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+