పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళకి లొంగి పోయాడా - పేర్ని నాని..!!
జనసేన అధినేత పవన్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ది ఆంద్రప్రదేశ్ కాదా అని ప్రశ్నించారు. రాజకీయం కోసమే ఆంధ్ర ప్రదేశ్ కావాలా అని నిలదీసారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళకి లొంగి పోయాడా అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ మంత్రి ఏపీని కించ పరిస్తే అది వేరే ఇది అని పవన్ అంటున్నారని..తెలంగాణ తరుపున వకాల్తా పుచ్చుకొని పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను ఏమి అనకపోయినా పవన్ తమ పై నిందలు వేస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు.
జనసేనాని పవన్ తాజాగా వైసీపీ నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ వీడియో విడుదల చేసారు. దీని పైన స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ జనం మర్చిపోతున్నారని అప్పుడప్పుడు ట్వీట్ పెడుతున్నారని ఎద్దేవా చేసారు. పవన్ కళ్యాణ్ కి ఈ కొత్త బాధ ఏంటో అర్ధం కావడం లేదన్నారు. తెలంగాణకు చెందిన మంత్రి మన రాష్ట్రాన్ని అవమనిచేలా మాట్లాడితే ఏపీ మంత్రులు స్పందించారని చెప్పారు. ఇంతకు ముందు చంద్రబాబు, లోకేష్ ని అంటే పవన్ వచ్చే వారని..ఇప్పుడు తెలంగాణ మంత్రులను ఏదైనా అంటే పవన్ కళ్యాణ్ వకాల్తా పుచుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కొత్త వకీల్ పాత్ర ఏంటో అర్ధం కావడం లేదన్నారు.

వైయస్ వివేకా హత్య కేసులో అసలు ముద్దాయిలను వదిలేసి, అసహజ రీతిలో విచారణ జరుగుతుందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. సీబీఐ అధికారి రాం సింగ్‌ను ఈ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు తప్పించమని చెప్పిందని గుర్తు చేసారు. అదే రీతిలో ఇప్పడు వచ్చిన అధికారులు విచారణ జరుపుతున్నారన్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ కోణంలో విచారణ జరపడం వెనుక ఒత్తుడులు, లొంగుబాటు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు సీఎం గా ఉండగా వైయస్ జగన్ పై హత్య యత్నం జరిగిందన్నారు. చంద్రబాబు టైమ్ లో ఏం విచారణ జరిగిందని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా తప్పుడు దర్యాప్తు చేసిందని విమర్శించారు.
స్టీల్ ప్లాంట్ వ్యవహారం పైన పేర్ని నాని స్పందించారు. స్టీల్ ప్లాంట్‌ను అమ్మకుండా నేనే ఆపానని పవన్ అంటున్నారని, తన ట్వీట్ వల్లే ఆగిపోయిందని ఇంకొకాయన అంటున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్తే ఇప్పుడు ఎవరూ నోరెత్తడం లేదన్నారు. స్టీల్ ప్లాంట్‌పై ఢిల్లీ పెద్దలతో పవన్ ఎందుకు మాట్లాడటం లేదని పేర్ని నాని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications