హైద్రాబాద్‌లో కిలాడీ బ్రదర్స్: జల్సాల కోసమే (పిక్చర్స్)

హైదరాబాద్: జల్సాలకు అలవాటు పడి చైన్ స్నాచర్లుగా మారిన అన్నదమ్ములను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వీరితో పాటు దొంగిలించిన సొత్తును కొన్న వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి రూ.17.50 లక్షల విలువ గల 51 తులాల బంగారు ఆభరణాలు, ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం చిక్కడపల్లి ఏసీపీ కార్యాలయంలో సెంట్రల్ జోన్ డీసీపీ పీవి కమలాసన్ రెడ్డి నిందితుల వివరాలను వెల్లడించారు.

టోలీచౌకీ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అమీర్, మహమ్మద్ ఇమ్రాన్‌లు అన్నాతమ్ముళ్లు. చిన్నప్పటి నుండి చెడు వ్యసనాలకు బానిసయ్యారు. సులభంగా డబ్బుసంపాదించడానికి స్నాచింగులు చేయడం మొదలు పెట్టారు. మహిళల మెడల్లో నుండి బంగారు ఆభరణాలు దొంగతనం చేయడం వృత్తిగా మార్చుకున్నారు. వీరిపై చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో 8, చాదర్‌ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు, గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు, అంబర్ పేట, ముషీరాబాద్, నాంపల్లి, గోల్కొండ పీఎస్‌ల పరిధిలో ఒక్కో కేసు నమోదయి ఉంది.

గత నెల 24న నిందితులు టోలీచకిలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు దాడి చేయగా అమీర్ పరారయ్యాడు, ఇమ్రాన్ పోలీసుల నుండి తప్పించుకునేందుకు భవనం పై నుండి దూకాడు. దీంతో అతని చేయి, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతరం కింగ్ కోఠీలో బైక్ అమ్ముతుండగా ఇమ్రాన్‌ను పట్టుకున్నాడు. వీరి నుండి దొంగ సొత్తు కొనుగోలు చేసిన జాఫర్‌ను రిమాండుకు తరలించారు. ఇమ్రాన్‌ను కూడా అరెస్టు చేసి రిమాండుకు పంపిస్తామని చెప్పారు.

సోదరులు

సోదరులు

జల్సాలకు అలవాటు పడి చైన్ స్నాచర్లుగా మారిన అన్నదమ్ములను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నిందితులు దొంగిలించిన బైక్‌లు.

సోదరులు

సోదరులు

జల్సాలకు అలవాటు పడి చైన్ స్నాచర్లుగా మారిన అన్నదమ్ములను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండుకు తరలించారు.

సోదరులు

సోదరులు

జల్సాలకు అలవాటు పడి చైన్ స్నాచర్లుగా మారిన అన్నదమ్ములను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నిందితులు దొంగిలించిన చైన్లు.

సోదరులు

సోదరులు

జల్సాలకు అలవాటు పడి చైన్ స్నాచర్లుగా మారిన అన్నదమ్ములను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. రిమాండుకు తరలిస్తున్న పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+