పదేళ్ల బాలికపై జనసేన నేత పైశాచికం - తుని ఘటన మరువక ముందే...!!

సభ్య సమాజంలో అసలు మహిళలకు రక్షణ ఉందా అనే అనుమానం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా అత్యాచారానికి గురవుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మృగాళ్లు దారుణాలకు ఒడిగడుతుండగా.. ఇప్పటికే ఎందరో మహిళలు బలయ్యారు. ఇక ఇప్పుడు ఏపీలో తునిలో మైనర్ బాలికపై జరిగిన ఘటనా మరిచిపోకముందే మరోసారి కోనసీమలో అలాంటి ఘటన చోటుచేసుకోవడం తీవ్రకలకలం రేపుతోంది.

పదేళ్ల బాలికపై పైశాచికం..

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐ.పోలవరం మండలం బాణాపురం గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలిక (ఆరవ తరగతి విద్యార్థిని)పై పలుమార్లు అఘాయిత్యం జరిగినట్టు బయట పడింది. కాగా సదరు బాలిక చదువుతున్న స్కూల్ సమీపంలోని ఒక భవనంలోకి తీసుకువెళ్లి.. జనసేన నాయకుడు రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ (బాబీ)బట్టలు విప్పి వికృతి చేష్టలు చేసినట్టు గుర్తించారు.

physi8cal-assault-on-ten-year-old-girl-by-jana-sena-leader-at-konaseema

అయితే స్కూల్ అయిపోయిన తర్వాత బాలిక ఆ భవనం నుంచి బయటకు వస్తుండగా.. ఆమె తల్లి అనుమానం వచ్చి ప్రశ్నించడంతో అసలు విషయం బట్టబయలైంది. బాలిక తల్లి తన బంధువులతో కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలవరం పోలీస్‌ స్టేషన్‌ అధికారులు బాలిక తల్లి నుండి ఫిర్యాదు స్వీకరించి.. నిందితుడిపై పోక్సో చట్టంలోని సెక్షన్ 6 మరియు సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొద్దిరోజుల క్రితమే కాకినాడ జిల్లా తునిలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. హంసవరం ప్రాంతానికి చెందిన నారాయణరావు అనే వృద్ధుడు.. స్థానిక గురుకుల పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి మైనర్ బాలికను హాస్టల్ నుంచి "ఇంటికి తీసుకెళ్తాను" అని చెప్పి.. సమీపంలోని సపోటా తోటలోకి తీసుకెళ్ళాడు. ఓ యువకుడు ఈ విషయాన్ని గమనించి వీడియో తీస్తూ వారిని ప్రశ్నించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ తర్వాత బాలిక గ్రామస్థులు నారాయణరావును పట్టుకుని దేహశుద్ది చేశారు. మంత్రులు నారా లోకేష్, అనిత కూడా దీనిపై స్పందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు పోలీసులు తీసుకెళ్తున్న క్రమంలో బహిర్భూమికి వెళ్లాలని చెప్పి నారాయణరావును వాహనాన్ని ఆపారు.. ఆ తర్వాత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+