సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో దారుణం.. వివాహితపై గ్యాంగ్ రేప్ !!
సభ్య సమాజంలో అసలు మహిళలకు రక్షణ ఉందా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మృగాళ్లు దారుణాలకు ఒడిగడుతుండగా.. ఇప్పటికే ఎందరో మహిళలు బలయ్యారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా అత్యాచారానికి గురవుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే వివాహిత గ్యాంగ్ రేప్ కి గురి కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఏం జరిగిందంటే..
కుప్పం మండలం N.కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని నిమ్మకంపల్లిలో వివాహితపై ముగ్గురు యువకులు 10 రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బయటకు చెబితే ఆమెతో పాటు కుటుంబాన్ని సైతం చంపేస్తామని దుండగులు బెదిరించినట్టు వాపోతున్నారు. గత 10 రోజుల నుంచి ఈ దారుణ ఘటనతో నరకయాతన అనుభవించిన వివాహిత.. ఎట్టకేలకు అత్యాచారం జరిగిన విషయాన్ని భర్తకు వెల్లడించింది. తనపై ముగ్గురు యువకులు పాశవికంగా ప్రవర్తించిన తీరును బయటపెట్టింది.

దీంతో ఈ ఘటన వెలుగులోకి లోకి రాగా.. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఇప్పటివరకూ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరొకరి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. విషయం బయటకు చెప్తే కుటుంబాన్ని అంతం చేస్తామని నిందితులు బెదిరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.












Click it and Unblock the Notifications