ఫైనల్‌కు నారా లోకేష్ రిహార్సల్: మీడియాతో ఇలా... (పిక్చర్స్)

హైదరాబాద్: తన తండ్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నుంచి పగ్గాలను తీసుకోవడానికి తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ సిద్ధపడుతున్నట్లే కనిపిస్తున్నారు. ఆయన శనివారంనాడు తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించారు. చంద్రబాబు ఆస్తులతో తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ఆస్తులను, తన ఆస్తులను ఆయన ప్రకటించారు.

దానికితోడు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలపై కూడా ఆయన తనదైన తరహాలో వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితి చెడిపోయిందని, పాలన ఇప్పుడే గాడిలో పడుతుందని ఆయన చెప్పారు. దానికితోడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు అనుమతి నిరాకరించడంపై కూడా మాట్లాడారు.

2019లో జరిగే ఎన్నికల నాటికి నారా లోకేష్ పూర్తిగా పార్టీని తన భుజస్కంధాల మీదికి ఎత్తుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆయనే ముందుకు వస్తారని అంటున్నారు. వైయస్ జగన్‌ను ఢీకొనడానికి ఆయన ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

మీడియాతో లోకేష్

మీడియాతో లోకేష్

కుటుంబ సభ్యుల ఆస్తులను నిరుడు చంద్రబాబు ప్రకటించారు. ప్రతి సెప్టెంబర్‌లో తమ ఆస్తులను ప్రకటించాలనే నియమానికి అనుగుణంగా ఈసారి నారా లోకేష్ కుటుంబ సభ్యుల ఆస్తులు ప్రకటించారు.

మీడియాతో లోకేష్

మీడియాతో లోకేష్

మీడియాను ఎదుర్కోవడాన్ని కూడా నారా లోకేష్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ట్విట్టర్ వ్యాఖ్యలు చేయడం, బహిరంగ సభల్లో మాట్లాడడమే ఎక్కువగా చేస్తూ వచ్చారు.

మీడియాతో లోకేష్..

మీడియాతో లోకేష్..

ఒకటి రెండు సార్లు మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ ఆయా సందర్భాల్లో తన ప్రతిస్పందనను వినిపించారు. శనివారంనాడు పూర్తి స్థాయి మీడియా సమావేశంలో మాట్లాడారు.

మీడియాతో లోకేష్...

మీడియాతో లోకేష్...

తెలుగుదేశం పార్టీ వ్యవహారాలన్నీ ఇప్పటికే నారా లోకేష్ చేతుల్లోకి వెళ్లిపోయినట్లు ప్రచారం సాగుతోంది. ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్సిగా నియమించవచ్చునని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

మీడియాతో లోకేష్...

మీడియాతో లోకేష్...

మీడియా సమావేశంలో ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ముగించాలి అనే విషయంపై కూడా ఆయన పెద్దగానే కసరత్తు చేసినట్లు కనిపిస్తున్నారు.

మీడియాతో లోకేష్...

మీడియాతో లోకేష్...

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ పక్కకు వెళ్లడం ఖాయమైన స్థితిలో పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించడంపై నారా లోకేష్ దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+