పవన్ కళ్యాణ్ ప్రభంజనం.. గాజు పగిలేకొద్దీ పదునెక్కిద్ది డైరెక్టర్ హరీష్ శంకర్ పోస్ట్

Pithapuram assembly election Results: పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ విజయం వైపు దూసుకు వెళ్తున్నారు . పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, జనసేన పార్టీ అభ్యర్థులు విజయం వైపు అడుగులు వేస్తున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ గెలుపు పక్కా కాగా, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తారని, జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని ప్రస్తుతం ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించడం పట్ల ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. పిఠాపురం లో భారీ ఆధిక్యం దిశగా ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి 25244 ఓట్ల ఆధిక్యం లో పవన్ ఉన్నారని, ఇంకా 12 రౌండ్లు మిగిలి ఉన్నాయని జన సైనికుల పోస్టులు పెడుతున్నారు.

Pithapuram Assembly Election 2024 pawan kalyan sensation director harsh shankar powerful post

ఘన విజయం వైపు పవన్ కళ్యాణ్
పిఠాపురంలో భారీ మెజారిటీతో ఘన విజయం వైపుగా పవన్ కళ్యాణ్ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగా, చేబ్రోలు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ఫలితాలను నాగబాబు ఆయన సతీమణి పద్మజ, డాక్టర్ మాధవి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ పైన ఆసక్తి కొనసాగుతుంది.

పవన్ కళ్యాణ్ కోసం ఆలయాలలో పూజలు
హైయెస్ట్ మెజారిటీ పవన్ కళ్యాణ్ కు వస్తుందని పెద్ద ఎత్తున బెట్టింగ్ లకు పాల్పడ్డారు. ఏపీలోని పిఠాపురం వాసులు. అటు ఏపీ వాసులు మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ పవన్ కళ్యాణ్ విజయం పైన, ఆయన మెజారిటీ పైన బెట్టింగులు కట్టారు. ఈరోజు ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ గెలవాలని ఆలయాలలో పూజలు చేసిన వారు ఎంతోమంది ఉన్నారు.

పిఠాపురంలో జనసైనికుల సంబరాలు
ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం పక్కా కాగా జనసైనికులు సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ పాటలు పెట్టుకుని పిఠాపురం దద్దరిల్లేలా స్టెప్పులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల కూటమి ఘన విజయం సాధించడంతో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.

పవర్ ఫుల్ ట్వీట్ చేసిన హరీష్ శంకర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ తో తాను తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని "గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం' గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్ది" అని పవన్ కళ్యాణ్ డైలాగ్ వీడియోను హరీష్ శంకర్ మరో మారు పోస్ట్ చేశారు. ఇక ఈ ట్వీట్ పై అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసల జల్లు కురుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+