Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వంగా గీతకు జగన్ కీలక పదవి - చంద్రబాబు, పవన్ ఫిక్స్...!!

ఏపీ ఎన్నికల్లో పిఠాపురం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీతకు మద్దతుగా జగన్ ప్రచారం చేసారు. ఎన్నికల్లో తన చివరి ప్రచార సభలో పిఠాపురం వేదికగా జగన్ సంచలన ప్రకటన చేసారు. వంగా గీతను గెలిపిస్తే దక్కే పదవి గురించి స్పష్టత ఇచ్చారు. పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అంతకు ముందు వంగా గీత తన గెలుపు పైన ఉద్వేగానికి లోనయ్యారు.

జగన్ కీలక ప్రకటన
ముఖ్యమంత్రి జగన్ పిఠాపురం వేదికగా కీలక అంశం వెల్లడించారు. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే తన కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పిస్తానని ప్రకటించారు. జగన్ ప్రభుత్వంలో గత అయిదేళ్ల కాలంగా కాపు వర్గానికి డిప్యూటీ సీఎం పదవి గోదావరి జిల్లాలకే అవకాశం ఇచ్చారు.

Pithapuram political heat Jagan promises deputy cm to vanga geetha hits out at Pawan Kalyan

ఇప్పుడు వంగా గీతకు ఇస్తానని చెప్పుకొచ్చారు. పవన్ వ్యవహార శైలి పైన విమర్శలు చేసారు. చంద్రబాబు చేసే ప్రతీ మోసం వెనుక పవన్ ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే ఎవరికి మేలు జరుగుతుందనేది ఆలోచించాలని జగన్ సూచించారు.

పవన్ పై జగన్ కామెంట్స్
చంద్రబాబు సాధ్యం కాని హామీలు మేనిఫెస్టోలో ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే..మహిళలు, రైతులను పొడిచేందుకు పవన్ కత్తి అందిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే అయితే ఎవరికి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. దత్తపుత్రుడుని నమ్మే పరిస్థితి ఉంటుందా అని నిలదీసారు. అయిదేళ్లకు ఒక సారి భార్యను నమ్మే ఈ వ్యక్తి గురించి ఆలోచన చేయాలన్నారు.

ఒక సారి చేస్తే పొరపాటు.. రెండో చేస్తే గ్రహపాటు..నాలుగో సారి చేస్తే అలవాటు కాదా అని ఆలోచించాలన్నారు. ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఎవరైనా పోయి పని అడగగలరా అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. పిఠాపురంలో ఓటు వేస్తే ఈ మనిషి ఇక్కడ ఉంటారా అంటూ జగన్ ప్రశ్నించారు.

గీతకు పదవి..కూటమి ఫిక్స్
జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్లిపోయారని ఎద్దేవా చేసారు. భీమవరం, గాజువాక అయిపోయింది. ఇప్పుడు పిఠాపురం కు వచ్చారని చెప్పుకొచ్చారు. గీతను డిప్యూటీ సీఎం చేస్తానని ప్రకటించటం ద్వారా జగన్ వ్యూహాత్మకంగా చంద్రబాబు, పవన్ ను ఫిక్స్ చేసారు. పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని గతంలో లోకేష్ చేసిన వ్యాఖ్యల పైన జనసైనికులు మండిపడ్డారు.

పవన్ కు కూటమి గెలిస్తే ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది ఇప్పటి వరకు చంద్రబాబు నుంచి స్పష్టత రాలేదు.ఈ సమయంలో పవన్ పైన గెలిస్తే వంగా గీతకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని చెప్పటం ద్వారా.. పవన్ కు మద్దతుగా నిలుస్తున్న వారిలో పోలింగ్ వేళ ఆలోచన కలిగేలా జగన్ వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేసినట్లు స్పష్టం అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+