పవన్ కళ్యాణ్ పై వర్మ సంచలన ట్వీట్..? కష్టపడి గెలిస్తేనే...!
ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తొలిసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకు ముందు ఎన్నికల్లో రెండు సీట్లలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే పవన్ చివరి నిమిషంలో పిఠాపురం సీటు ఎంచుకోవడంతో అక్కడ పోటీకి సిద్ధమైన టీడీపీ సీనియర్ నేత ఎస్వీఎస్ ఎన్ వర్మ త్యాగం చేయాల్సి వచ్చింది. అంతటితో ఆగకుండా పవన్ గెలుపు కోసం పనిచేయాల్సి వచ్చింది. అయితే పవన్ గెలిచాక సీన్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది.
పిఠాపురం నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్వీఎన్ వర్మ పవన్ గెలుపులో కీలకంగా పనిచేశారు. అయితే ఆ తర్వాత తనను పట్టించుకోవడం లేదన్న బాధో, ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కలిసి తాము అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ సీటు ఇస్తామన్న హామీని గాలికొదిలేశారన్న బాధో తెలియదు కానీ లోలోపల కుమిలి పోతున్నట్లు అర్దమవుతోంది. ఇప్పటికే ఆయన తన సహచరుల వద్ద పిఠాపురంలో కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిస్ధితులు, జనసేన క్యాడర్ తనకు దూరంగా ఉండటం వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ బాధపడుతున్నారట. దీనికి పరాకాష్ట అన్నట్లుగా ఇవాళ వర్మ ఓ సంచలన ట్వీట్ పెట్టారు.

కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం! pic.twitter.com/v8vA1u9HQ4
— SVSN Varma (@SVSN_Varma) February 20, 2025
కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ వర్మ తన ఎక్స్ హ్యాండిల్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఓ వీడియోను కూడా జత చేశారు. ఈ వీడియోలో పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం వీడియోలు అన్నీ కలిపి పెట్టారు. అయితే ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు. కేవలం పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం మాత్రమే ఉంది. దీంతో పాటు ఆయన పెట్టిన ట్యాగ్ లైన్ కూడా చూస్తే పవన్ కష్టపడి విజయం సాధించలేదని, తానే కష్టపడి పవన్ ను గెలిపించాననే అర్ధం వచ్చేలా ఈ వీడియో, పోస్టు కూడా ఉన్నాయి. దీంతో ఆయన అభిమానులు ఈ పోస్టుకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications