Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందరి దృష్టీ సాగరనగరం వైపే..!!

International Yoga Day 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాగరనగరం విశాఖపట్నం కోలాహలంగా మారింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. ఇంకాస్సేపట్లో యోగా కార్యక్రమంలో పాల్గొనున్నారు.

గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. వారితోపాటు పలువురు మంత్రులు యోగా కార్యక్రమంలో పాల్గొననున్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్.. నగరవ్యాప్తంగా యోగా క్యాంపులను నిర్వహించనుంది.

PM Modi CM Chandrababu takes part in the 11th International Day of Yoga in Visakhapatnam

మొత్తం అయిదు లక్షల మందితో యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆర్ కే బీచ్ దీనికి వేదిక. ఇదే రోజున దాదాపుగా 10 లక్షల మందికి యోగా సర్టిఫికెట్ అందజేయనుంది. వరల్డ్ రికార్డులతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా ఈ వేడుకకు చోటు దక్కనుంది.

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహాకంగా ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చిన విషయం తెలిసిందే.కిందటి నెల 21వ తేదీ దీనికి శ్రీకారం చుట్టింది. దీనికింద- రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాల్లో స్థానిక అధికార యంత్రాంగం యోగా శిబిరాలు, శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది.

ఈ నెల రోజుల యోగా కార్యక్రమాల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా రెండుకోట్ల మందికి పైగా యోగాలో పాల్గొన్నారు. దీనికి అనుగుణంగా అప్పట్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది ఏపీ ప్రభుత్వం. 2,500 మందిని యోగా మాస్టర్ ట్రైనర్స్‌‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.

యోగాపై సమగ్ర అవ‌గాహ‌న, శిక్ష‌ణ ఇచ్చిందీ కార్యక్రమాల ద్వారా. యోగా కామ‌న్ ప్రోటోకాల్ ప్ర‌కారం ఇవి కొనసాగుతూ వచ్చాయి. నేటితో ఈ నెల రోజుల యోగాంధ్ర కార్యక్రమం ముగియనుంది. అయినప్పటికీ- వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని కొనసాగించే అవకాశాలు లేకపోలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+