దక్షిణాదిలో చంద్రబాబు, పవన్ కు మోదీ బిగ్ టాస్క్..!!
జమిలి దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దక్షిణాది లో ఎన్డీఏ బలోపేతం పైన ప్రత్యేకంగా ప్రధాని మోదీ ఫోకస్ చేసారు. ఇందు కోసం తాజాగా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసారు. జమిలి నాటికి దక్షిణాదిన ఎన్డీఏను బలోపేతం చేయటం లక్ష్యం గా ఈ నిర్ణయం తీసుకున్నారు. సమన్వయ కర్తగా జేపీ నడ్డా ఈ కమిటీని పర్యవేక్షిస్తారు. ఇందులో చంద్రబాబు, పవన్ కు బిగ్ టాస్క్ అప్పగించారు.
బీజేపీ మిషన్ సౌత్
ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న ఎన్డీఏ దక్షిణాదిన విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. జమిలి వైపు ఆలోచన చేస్తున్న ప్రధాని మోదీ, అమిత్ షా ఇప్పుడు దక్షిణాదిలోనూ ఎన్డీఏ కు సీట్లు ఎలా పెంచుకోవాలనే అంశం పైన ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టారు. ఇందుకోసం కేంద్ర మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసారు. ఈ కమిటీ దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు .. ప్రజల మూడ్ .. అమలు చేయాల్సిన నిర్ణయాలు .. సంక్షేమ పథకాలతో పాటుగా రాజకీయ వ్యూహా లను సూచించనుంది. ఈ కమిటీ సమన్వయ కర్తగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు బాధ్యత లు అప్పగించారు.

కమిటీ ఏర్పాటు
ఈ కమిటీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, రామ్మోహన్ నాయుడు ను నియమించారు. ఈ ముగ్గురు మంత్రులు దక్షిణాది రాష్ట్రాల వారీగా సబ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కమిటీ లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు సభ్యులుగా ఉండనున్నారు. వీరు స్థానికంగా ఉన్న అంశాలను కమిటీకి వివరించి.. బలోపేతానికి కావాల్సిన సూచనలు చేసేలా కార్యాచరణ సిద్దం చేసారు. రానున్న మూడేళ్ల కాలంలో ఎన్డీఏను దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా నిర్దేశించారు.
చంద్రబాబు - పవన్ కు టాస్క్
ఇప్పటికే ఈ కమిటీ ఏర్పాటు.. తమ లక్ష్యాల గురించి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేత చంద్రబాబుతో బీజేపీ ముఖ్యులు చర్చించారు. ఇక.. ఈ కమిటీకి నిరంతరం చంద్రబాబుతో టచ్ లో ఉండాలని పార్టీ నేతలు మంత్రులకు సూచించారు. చంద్రబాబు ఎన్డీఏ బలోపేతం కోసం వ్యూహాలను ఈ కమిటీకి అందించనున్నారు. అదే విధంగా జనసేనాని పవన్ దక్షిణాది రాష్ట్రాల్లో తనకు ఉన్న ఇమేజ్ తో ఎన్డీఏ బలోపేతం కోసం తరచూ పర్యటనలు చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. చంద్రబాబు వ్యూహాలు.. పవన్ ప్రచారం ద్వారా తాము చేపట్టిన మిషన్ సక్సెస్ చేసేందుకు బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications