మెగా బ్రదర్స్ తో మోదీ సందడి - భవిష్యత్ పై సంకేతాలు..!!
ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేళ ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకారం ముగిసిన తరువాత ప్రధాని మోదీని పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ప్రధాని మోదీ మెగా బ్రదర్స్ తో సందడి చేసారు. ప్రత్యేకంగా చిరంజీవి-పవన్ చేతులు పైకి లేపి అభివాదం చేసారు. పవన్ ను ప్రధాని సమక్షంలోనే చిరంజీవి ప్రశంసించారు. మెగా బ్రదర్స్ ఇద్దరిని మోదీ ప్రశంసించారు. అదే సమయంలో రాజకీయంగానూ కొత్త చర్చకు కారణమయ్యారు.
మోదీ ప్రత్యేక ప్రశంసలు
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హజరయ్యారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబును ఆలింగనం చేసుకున్న ప్రధాని అభినందించారు. ప్రమాణ స్వీకారం చేసిన ప్రతీ మంత్రి నేరుగా ప్రధాని వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక..చంద్రబాబు తరువాత పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసారు. పవన్ ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. పాదాభివందన చేసే ప్రయత్నాన్ని వారించారు. పవన్ ఆ వెంటనే అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేసారు.

మెగా బ్రదర్స్ తో సందడి
మంత్రులు వరుసగా ప్రమాణ స్వీకారం తరువాత ప్రధాని తో పవన్ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రధానిని తన అన్నయ్య వద్దకు తీసుకెళ్లారు. చిరంజీవిని చూసిన వెంటే ప్రధాని అభినందించారు. ఆలింగనం చేసుకున్నారు. చిరంజీవి, పవన్ ను కలిపి ఇద్దరు చేతులు పైకి లేపి అభివాదం చేసారు. మెగా బ్రదర్స్ భజం తడుతూ అభినందించారు. ఆ సమయంలో తమ్ముడి సమర్ధత గురించి చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇద్దరూ ఇద్దరే అంటూ ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం తరువాత ఈ సన్నివేశం చూస్తూ మెగా కుటుంబం ఉద్వేగానికి లోనైంది.
రాజకీయ సంకేతాలు
ఇదే సమయంలో మెగా బ్రదర్స్ తో ప్రధాని మోదీ సందడి చేయటం..ప్రమణ స్వీకారం వేళ ప్రత్యేకార్షణగా నిలిచింది. భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు నాందిగా నిలిచిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఏపీలో మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. ఏపీలో మూడు ఎంపీ, ఆరు ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన బీజేపీ భవిష్యత్ పైన ఆశతో ఉంది. దీంతో..రాష్ట్రంలో మంచి ప్రజాకర్షణ ఉన్న వ్యక్తులుగా మెగా బ్రదర్స్ ఉన్నారు. పవన్ - మోదీ మధ్య ఇప్పటికే ప్రత్యేక అనుబంధం ఉంది. చిరంజీవిని సైతం తమతో కలుపుకోవాలనేది ప్రధాని మోదీ ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో..మెగా బ్రదర్స్ సహకారంతో బీజేపీ రానున్న రోజుల్లో అమలు చేసే రాజకీయ వ్యూహాల పైన ఆసక్తి మొదలైంది.
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications