కొత్తపల్లి గీతకు 5 ఏళ్ల జైలు శిక్ష- బ్యాంక్ రుణం ఎగవేత..!!
బ్యాంకు రుణం ఎగవేత కేసులో వైసీపీ మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించింది. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులతో పాటుగా సహకరించిన బ్యాంకు అధికారులకు కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. గ్రూప్ 1 అధికారిగా పని చేసిన కొత్తపల్లి గీత భర్తతో కలిసి విశ్వేశ్కర ఇన్‌ఫ్రా.లిమిటెడ్ సంస్థ నిర్వహించారు. ఆ సంస్థ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ 42 కోట్లకు పైగా రుణం తీసుకున్నారు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించకపోవటంతో బ్యాంకు అధికారులు కేసు నమోదు చేసారు.
విచారించిన సీబీఐ అధికారులు తప్పుడు పత్రాలు..సమాచారంతో రుణం తీసుకున్నట్లుగా గుర్తించారు. ఇందుకు సహకరించిన బ్యాంకు అధికారుల పైన కేసు నమోదు చేసారు. 2015 జూలైలోనే దీనికి సంబంధించి కేసు నమోదైంది. దీని పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ..ఉద్దేశ పూర్వకంగానే రుణం కట్టకుండా బ్యాంకును మోసం చేసారని అభియోగాలు నమోదు చేసింది.
దీని పైన విచారించిన సీబీఐ కోర్టు కొత్తపల్లి గీత దంపతులకు అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. గీత దంపతులకు శిక్ష, జరిమానా విధింపుతో పాటు బ్యాంకు అధికారులు జయప్రకాశన్, అరవిందాక్షన్‌కు కూడా సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. విశ్వేశ్వర సంస్థకు రూ.2 లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కొత్తపల్లి గీతతో పాటుగా భర్త రామకోటేశ్వరరావులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. దంపతులిద్దరూ బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన దాఖలు చేసారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలుకు గీతను తరలించినట్లుగా చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో తొలి సారిగా వైసీపీ నుంచి కొత్తపల్లి గీత అరకు ఎంపీగా గెలుపొందారు. ఆ తరువాత వైసీపీని వీడి టీడీపీకి దగ్గరయ్యారు.
2018లో జనజాగృతి పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేసారు. ఆ తరువాత కాలంలో బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత..తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక, రుణం ఎగవేత కేసులో సీబీఐ అరెస్ట్ చేయటం.. కోర్టు అయిదేళ్ల శిక్ష విధించటంతో ఇప్పుడు కొత్తపల్లి గీత వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications