ఆమ్‌వే సిఇవో విజయం స్కాట్ పింక్నీ అరెస్టు
హైదరాబాద్: మల్టీ మార్కెటింగ్ సంస్థ ఆమ్‌వే ఇండియా సిఇవో విలియం స్కాట్ పింక్నీని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. చీటింగ్ కేసులో విలియం స్కాట్‌ను పోలీసులు గుర్గావ్‌లో అదుపులోకి తీసుకున్నారు. విలియం స్కాట్ పింక్నీపై కర్నూలులో పలు కేసులున్నాయి.
పింక్నీని పోలీసులు అరెస్టు చేయడం ఇది రెండో సారి. అనైతికమైన డబ్బుల పంపిణీని పోత్సహిస్తున్నారంటూ 2013 డిసెంబర్‌లో నమోదైన కేసులో పింక్నీని గుర్గావ్‌లోని అమ్‌వే కేంద్ర కార్యాలయంలో సోమవారం అరెస్టు చేశారు.

కర్నూలు పోలీసులు తమ సీనియర్ అధికారిని కస్టడీలోకి తీసుకోవడం దురదృష్టకరమని సంస్థ అధికారులు ఎకనమిక్స్ టైమ్స్‌తో అన్నారు. దర్యాప్తునకు పింక్నీ సహకరిస్తున్నారని, ఇక్కడే ఉన్నారని వారన్నారు. నిరుడు ఇదే కాలంలో పింక్నీని కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
విలియం స్కాట్ పింక్నీపై దేశవ్యాప్తంగా పలు కేసులున్నాయి. అయితే, తమ వ్యాపారమంతా చట్టబద్దమేనని ఆమ్‌వే అధికారులు అంటున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.
కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు
పింక్నీని కర్నూలు పోలీసులు మంగళవారం కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు పింక్నీనికి 14 రోజుల రిమాండ్ విధించింది.












Click it and Unblock the Notifications