చింటూ బయటకొస్తే అంతు చూస్తా!: ఎమ్మెల్యే సోదరుడికి బెదిరింపు, అరెస్ట్

చిత్తూరు: చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మరిది డీకే బద్రీనారాయణను బెదిరించిన కేసులో సాయిగణేష్ అనే వ్యక్తిని సోమవారం నాడు చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఫిర్యాదుదారుడు, నిందితుడు ఇద్దరూ టిడిపికి చెందినవారే.

పూతలపట్టు మండలానికి చెందిన సాయి గణేష్‌కు చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మరిది బద్రీనారాయణకు సంబంధాలు ఉన్నాయి. బద్రీ వద్ద సాయిగణేష్ లేబర్ కాంట్రాక్టర్‌గా పని చేసేవాడు. బద్రీనారాయణ కుమార్తె హర్షిణి తమిళనాడు సీఎం జయలలిత వద్ద అదనపు ప్రిన్సిపల్ కార్యదర్శిగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి రామ్మోహన్ రావు కుమారుడు వివేక్‌కు ఇచ్చి వివాహం చేశారు.

2013లో బద్రీనారాయణ అల్లుడు, కుమార్తెలు వ్యాపారం కోసం సాయి గణేష్ నుంచి రూ.కోటి అప్పు తీసుకున్నారు. అయితే తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని అతను బుకాయించాడు. ఈ విషయం అందరికీ చెప్పి పరువు తీస్తానని బెదిరించాడు. ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే తనకు రూ.10 కోట్లు ఇవ్వాలని సాయి గణేష్ బెదిరించాడని బద్రీనారాయణ ఇటీవల చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Police arrest man for blackmailing MLAs brother

పైగా మేయర్ దంపతుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న చింటూ బెయిల్ పైన బయటకు వస్తే నీ అంతు చూస్తానని, పలువురు అల్లరిమూకల్ని ఇంటి వద్దకు తీసుకు వచ్చి గొడవ చేశాడని బద్రీ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేశారు.

సాయి గణేష్‌ వద్ద తీసుకున్న రూ.1కోటి బ్యాంకు ద్వారా చెల్లించినట్లు గుర్తించారు. దీంతో ఆదివారం హైదరాబాదులో సాయి గణేష్‌ను అరెస్టు చేశారు. అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టు అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+