రేపో ఎల్లుండో శ్రీరెడ్డి అరెస్ట్?

నిత్యం బూతులతో సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసే శ్రీ రెడ్డి ఇకపై కష్టాలను ఎదుర్కోబోతుందా? గత వైసిపి ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తదితరులపైన నోటికి వచ్చినట్టు అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డికి చుక్కలు చూపించేందుకు టిడిపి రెడీ అవుతోందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

కర్నూల్ పోలీస్ స్టేషన్ లో శ్రీరెడ్డిపై కేసు నమోదు
సినీ నటి, యూట్యూబర్స్ శ్రీరెడ్డి పైన, ఆమె చేసే అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సినీనటి శ్రీరెడ్డి పై కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి పైన కేసు నమోదు చేశారు పోలీసులు.

police case filed on youtuber srireddy over the complaint of tdp chance to arrest

చంద్రబాబు, పవన్, అనితలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తరువాత కూడా ఆమె టిడిపి నేతలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి బీసీ సెల్ నాయకుడు రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ కుటుంబంతోపాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత లపైన శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని టిడిపి నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

శ్రీరెడ్డిపై పెట్టిన సెక్షన్లు ఇవే
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే లాగా బూతులతో ఆమె సోషల్ మీడియా వేదికగా తమ నేతలపైన దూషణలు చేస్తున్నారని టిడిపి నేతలు తమ ఫిర్యాదులో ఆరోపించారు. టిడిపి నేతలు\ ఫిర్యాదుతో కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపైన సెక్షన్ 352, 353 బి ఎన్ ఎస్, 66 ఐటిఏ, 2000 2008 సెక్షన్ల కింద ఆమెపైన కేసులు నమోదు చేసినట్టు సమాచారం.

జగన్ కు అనుకూలంగా శ్రీరెడ్డి
అయితే శ్రీరెడ్డి నోటికి తాళం పడేలా ఆమెపైన తక్షణ చర్యలు తీసుకోవాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంతోకాలంగా టిడిపి అధినేత చంద్రబాబు పైన, లోకేష్, పవన్ కళ్యాణ్ ల పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడుతున్న శ్రీరెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తనదైన వీడియోలు చేస్తూ టిడిపిని టార్గెట్ చేస్తున్నారు.

శ్రీరెడ్డి బరితెగింపు వ్యాఖ్యలు.. అరెస్ట్ చేస్తారా?
టిడిపి నేతలపైన అసభ్య పదజాలంతో బరితెగింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. శ్రీరెడ్డి పైన చర్యలు తీసుకుంటే ఆమెలాగా మరెవరు బరితెగించే అవకాశం ఉండదని టిడిపి నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు . ఇక శ్రీరెడ్డికి త్వరలోనే పోలీసులు నోటీసులు జారీ చేసి, అనుచిత వ్యాఖ్యల వీడియోల ఆధారంగా ఆమెను రేపో, ఎల్లుండో అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదని ఏపీలో చర్చ జరుగుతుంది. మరి తనపైన కేసు నమోదు చేయడంపైన శ్రీరెడ్డి ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+