పోలీసు జాగిలం రాజా మృతి... అధికారిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు!!

పోలీసులు ఛేదించలేని ఎన్నో కేసులను ఆ పోలీస్ జాగిలం అత్యంత సమర్థవంతంగా చేధించింది. ఎక్కడైనా నేరం జరిగినప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులను పసిగట్టే తత్వం, నేరస్తుల కదలికలను నిశితంగా గమనించే నైజం, నేర పరిశోధనలో అనేక కేసులను సునాయాసంగా ఛేదించే తత్వం ఉన్న సూపర్ డాగ్.. పోలీసు జాగిలం రాజా అనారోగ్యంతో నేడు మృతి చెందింది.

పోలీస్ జాగిలం రాజా అనారోగ్యంతో మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి తాడూర్ పోలీస్ హెడ్ క్వార్టర్ లో పోలీస్ జాగిలం రాజా అనారోగ్యంతో మృతి చెందడంతో పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఉన్న పోలీసులు రాజా మృతితో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ అధికారులు , పోలీస్ జాగిలం హ్యాండ్లర్ మల్లేశం తో కలసి పోలీసు జాగిలం రాజాపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు .

Police dog Raja died with illness rajanna sircilla police did raja funeral with police honours

అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు
పోలీసు సిబ్బంది గౌరవ వందనంతో, అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు చేశారు. లాబ్రడార్ రిట్రీవర్ సంతతికి చెందిన రాజా వయసు 15 సంవత్సరాలు. ఇది జిల్లా పోలీసు యంత్రాంగానికి అనేక కేసులలో తన వంతు సహాయ సహకారాలను అందించింది. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పోలీస్ జాగిలం రాజా సేవలు మరువలేనివి అన్నారు.

పోలీస్ జాగిలం రాజా సేవలను కొనియాడిన జిల్లా ఎస్పీ
ఎన్నో కేసులలో తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించి నేరస్తులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. రాజా గత 14 సంవత్సరాల నుండి జిల్లాలో విఐపి. వివిఐపిలు సందర్శించినప్పుడు (ఆర్ఓపి) స్నిపర్, బాంబులు, మందు పాత్రలు, గుర్తించడంలో చాకచక్యంగా వ్యవహరించి విధులు నిర్వహించేదని కొనియాడారు.

14 సంవత్సరాలుగా రాజా సేవలు
2010 సంవత్సరంలో రాజా తన హ్యాండ్లర్ మల్లేశం తో పాటుగా ఎనిమిది నెలల పాటు IITA, మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చిందని, ఆ తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేటాయించగా జిల్లాలో గత 14 సంవత్సరాలుగా సేవలందించిందని కొనియాడారు.

Police dog Raja died with illness rajanna sircilla police did raja funeral with police honours

అనారోగ్యంతో మృతి చెందిన రాజాకు ఘనంగా వీడ్కోలు.. ఖననం
ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఈ సూపర్ డాగ్ అనారోగ్యంతో నేడు మృతి చెందిందని పేర్కొన్నారు. అధికారిక లాంచనాలతో అంతిమ వీడ్కోలు నిర్వహించి ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు యాదగిరి, మధుకర్, రమేష్, రాజా హ్యాండ్లర్ మల్లేశం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+