హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షేమ్ రేపిస్టుల క్లిప్‌పై విచారణ: సునితా కృష్ణన్‌పై వెంటనే దాడి ఎలా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సామాజిక కార్యకర్త సునితా కృష్ణన్ ఫేస్‌బుక్‌లో పెట్టిన షేమ్ రేపిస్టు క్లిప్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. వారు తెలంగాణవాళ్లా, ఉత్తర భారతదేశానికి చెందిన వారా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, సునితా కృష్ణన్‌ కారుపై దాడి చేసినవారిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. వీడియో క్లిప్ అప్‌లోడ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆ దాడి జరిగిందని పోలీసులు అంటున్నారు. అంత తొందరగా హైదరాబాద్ పాతబస్తీలో ఎవరు వచ్చి కారుపై దాడి చేసి ఉంటారనే విషయాన్ని పోలీసులు అడుగుతున్నారు.

Police yet to nab activist’s attackers

ఆ వీడియోకు, ఆ సంఘటనకు సంబంధం లేదని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. కొద్ది నిమిషాల్లో ఎవరు ఆ వీడియో క్లిప్ చూస్తారా, అంతలోనే ఎలా దాడి చేస్తారు అనేది పోలీసులకు సందేహం కలిగిస్తున్న విషయం. రేపిస్టులు హైదరాబాదుకు చెందినవారని చెప్పడానికి ఏ విధమైన ఆధారాలు లేవని అంటున్నారు.

హైదరాబాదులోని చార్మినార్ బస్ స్టాండ్ సమీపంలోని కార్యాలయం వద్ద పార్కు చేసిన కారుపై దుండగులు శుక్రవారం దాడి చేశారు. సునితా కృష్ణన్ అప్‌లోడ్ చేిసన వీడియో క్లిప్పును పోలీసులు పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఉన్న సునితా కృష్ణన్ కార్యాలయ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు.

English summary
The Hyderabad cyber crime police started an inquiry into the ‘shame rapists’ clip uploaded by activist Sunitha Krishnan. The rapists are yet to be identified and the police doubt if they are from Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X