పవన్ కళ్యాణ్‌ను మళ్లీ సినిమాల్లోకి లాగేందుకు రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయా? ఎందుకు, ఎలా?

అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగకుండా ఉండేందుకు కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నాలు చేశాయా? అందుకోసం సినిమాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ ద్వారా చెక్ చెప్పాలని చూశారా?

అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల జనసేనాని అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్‌కు నాలుగింతల రెమ్యునరేషన్

పవన్ కళ్యాణ్‌కు నాలుగింతల రెమ్యునరేషన్

పవన్ కళ్యాణ్ అభిమానుల భేటీలో మాట్లాడుతూ... తనను సినిమాల్లోకి లాగే ప్రయత్నాలు చేశారని, తనకు గతంలో వచ్చిన దాని కంటే రెండింతలు, మూడింతలు, నాలుగింతలు రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పారని, అసలు తన స్టార్ డమ్ ఇప్పుడు ప్రారంభమైందని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని చెబుతున్నారని అన్నారు.

సినిమాల్లోకి లాగుతున్నారా?

సినిమాల్లోకి లాగుతున్నారా?

అంటే తనను సినిమాల్లోకి లాగుతున్నారేమో అనిపిస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీతో కలిసి 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తనకు మూడు నాలుగు రెట్ల రెమ్యునరేషన్ పైన ఆయన కూడా ఒకింత అనుమానం వ్యక్తం చేసినట్లుగా కనిపించింది. నవ్వుతూనే... నన్ను సినిమాల్లోకి లాగుతున్నారేమో అనిపిస్తోందన్నారు.

 ఎన్నికల్లో అడ్డులేకుండా చేసుకునే ప్రయత్నాలా?

ఎన్నికల్లో అడ్డులేకుండా చేసుకునే ప్రయత్నాలా?

వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అడ్డులేకుండా ఉండేందుకు ఆయనను భారీ రెమ్యునరేషన్ పేరుతో లాగే ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నారా, నిజంగానే అలా చేస్తే ఆ రాజకీయ శక్తులు ఏమిటనే చర్చ సాగుతోంది. మొత్తానికి రెండు రోజుల క్రితం జనసేనాని చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తిని రేపుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+