ఏపీలో పొలిటికల్ మార్కెటింగ్: పోటాపోటీగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రమోషన్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియా వీర విహారం చేస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, కూ, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారానే కాకుండా, సోషల్ మీడియాలో నిత్యం రీల్స్, షార్ట్స్ చేస్తూ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్న పలువురిని పెద్ద ఎత్తున పొలిటికల్ మార్కెటింగ్ చేయించుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ పొలిటికల్ మార్కెటింగ్
రాష్ట్రంలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యంగా సోషల్ మీడియా పై ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలోయర్లు ఉన్న వారిని తమ పార్టీ ప్రచారం కోసం వాడుకుంటున్నారు. దీనికోసం వారికి పేమెంట్ కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేయడం ద్వారా పాపులర్ అయిన కొంతమంది ఇప్పుడు పొలిటికల్ ప్రచారం చేస్తున్నారు.

Political Marketing in AP Social Media Influencers Promoting mainly ysrcp and tdp

రాజకీయ పార్టీలకు మద్దతుగా రంగంలోకి పెయిడ్ ఇన్‌ఫ్లూయెన్సర్స్
పదేళ్ల క్రితం వరకు ఇన్‌ఫ్లూయెన్సర్ అన్నమాట సోషల్ మీడియాలో ఎక్కడ వినిపించలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇన్‌ఫ్లూయెన్సర్లు పుట్టుకొచ్చారు. యువతను, రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపించని వారిని తమ వీడియోలతో ఎంటర్టైన్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రచారం చేస్తున్నారు. పొలిటికల్ పార్టీలకు సంబంధించిన పోస్టులను వైరల్ చేస్తున్నారు.

చిన్న పోస్ట్ నుండి పాటల దాకా... పోస్టులతో ఇన్‌ఫ్లూయెన్సర్స్ సంపాదన
చిన్న పోస్ట్ దగ్గర నుంచి వీడియో సాంగ్ వరకు వివిధ పార్టీలకు సంబంధించిన ప్రచారాన్ని సాగిస్తున్నారు. మార్కెటింగ్ ద్వారా ప్రస్తుతం రోజుకు మినిమం 2000 రూపాయలను సంపాదిస్తున్నారు. ఇక బాగా ఫేమస్ అయిన ఇన్‌ఫ్లూయెన్సర్లు అయితే ఒక్కొక్క పోస్టుకు 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.

పోస్టుకో రేటు.. ఫాలోయర్స్ ను బట్టి రేటు
ఒక్కొక్క వాట్సప్ స్టేటస్ కి 80 రూపాయల నుంచి 160 రూపాయల వరకు, instagram లో పోస్ట్ కు పదివేల నుండి 50 వేల వరకు ఫాలోయర్లు ఉంటే 2000 రూపాయల నుంచి 2500 రూపాయల వరకు, అలాగే ఒక లక్ష నుంచి ఐదు లక్షల ఫాలోయర్లు ఉంటే 10వేల రూపాయలు నుంచి 15వేల రూపాయల వరకు రాజకీయపార్టీల నేతలు ఇస్తున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఓటర్లను ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+