2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల మనోగతం ఎలా ఉండబోతోంది: తేల్చేసిన తాజా సర్వే రిపోర్ట్

AP elections 2024: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్‌ఛార్జీల నియామకం, మార్పులు చేర్పుల వ్యవహారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడతలో 11 మంది కొత్త ఇన్‌ఛార్జీల నియామకాల జాబితా వెలువడింది.

రెండో లిస్ట్‌పై వైఎస్ఆర్సీపీ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నియోజకవర్గాలు ఇందులో ఉన్నట్లు సమాచారం. మలి జాబితాపై లీకులు వెలువడిన నేపథ్యంలో కొందరు సీనియర్లు క్రమంగా తమ అసమ్మతి గళాన్ని వినిపించడం మొదలుపెట్టారు కూడా.

Poll strategy group predicts the mood of the voters towards defected MLAs

ఉత్తరాంధ్రకు చెందిన కొందరు నేతలు వైఎస్ఆర్సీపీకి గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సీతంరాజు సుధాకర్ ఈ జాబితాలో ఉన్నారు. ఇతర పార్టీలో టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు సాగిస్తోన్నారు. రెండో జాబితా వెలువడిన తరువాత మరిన్ని రాజీనామాలు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.

ఎన్నికలు సమీపించినప్పుడు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఫిరాయింపులు సర్వ సాధారణమే. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న తెలంగాణలోనూ పెద్ద ఎత్తున ఫిరాయింపులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పలువురు సీనియర్ల మెడలో కొత్త పార్టీ కండువాలు కనిపించాయి.

ఏపీలో 2024లో జరగబోయే అసెంబ్లీ/లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లభించని ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ ఫిరాయించితే వారి పరిస్థితి ఏమిటనే విషయంపై పోల్ స్ట్రాటజీ గ్రూప్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఫిరాయింపుదారులపై ప్రజల మనోభావాన్ని తెలుసుకుంది. 74,257 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది.

Poll strategy group predicts the mood of the voters towards defected MLAs

పార్టీ ఫిరాయించిన అభ్యర్థులను గెలిపించడానికి మెజారిటీ ఓటర్లు సిద్ధంగా లేరని ఈ సర్వేలో తేలింది. ఫిరాయింపుదారులకు ఓటు వేయబోమని 76 శాతం మంది ఓటర్లు తేల్చి చెప్పారు. తొమ్మిది శాతం మంది మాత్రమే వారిని గెలిపించడం వైపు మొగ్గు చూపారు. మరో 15 శాతం మంది తమ అభిప్రాయాన్ని ఎటూ తేల్చలేకపోయారు.

దీన్ని బట్టి చూస్తే- నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఏపీ ఓటర్లు పెద్దగా పట్టించుకోనట్టే కనిపిస్తోంది. వైసీపీ లేదా టీడీపీకి రాజీనామా చేసి, మరో పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులకు ఓటమి తప్పదని, పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని ఓటర్లు తేల్చేసినట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+