పవన్ కల్యాణ్ సినిమాపై పూనమ్ కౌర్ పంచ్

పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ బంధం గురించి రకరకాల ఊహాగానాలు వస్తూ ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొనే పూనమ్ ఎప్పుడు ఏం మాట్లాడినా అందరూ ఆసక్తిని కనపరుస్తారు. కొన్నిసార్లు పరోక్షంగా పవన్ మీద ఎటాక్ చేయడానికి ప్రయత్నించింది. తాజాగా మరోసారి పవన్ ను లక్ష్యంగా ఎంచుకొని విమర్శలు చేసింది. పవన్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'ను లక్ష్యంగా ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.

'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ టీజర్ రిలీజ్ కాబోతుందని చెప్పే విషయాన్ని తెలియజేసేందుకు ఆ సినిమా యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. అయితే పూనమ్ ఈ పోస్టర్ పై అభ్యంతరం వ్యక్తం చేసింది. పోస్టర్ లో పవన్ కల్యాణ్ కాళ్లు మాత్రమే కనపడతాయి. పోస్టర్ కింద ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ ఉంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కాళ్ల కింద టైటిల్ ఉండటాన్ని పూనమ్ తప్పుపడుతోంది.

 poonam-

"మీరు విప్లవకారులను గౌరవించకపోయినా పర్వాలేదు. కానీ అవమానించకండి.. ఈ మధ్య విడుదలైన ఒక సినిమా పోస్టర్లో భగత్ సింగ్ అనే పేరు కాలి కింద ఉంది. ఇది అహంకారమా.. అజ్ఞానమా?" అని పూనమ్ కౌర్ ప్రశ్నించింది. సినిమా పోస్టర్‌ను ఇలా చూస్తే ఏం న్యాయమని, ఇలాగే అయితే ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుందని నెటిజన్లు పూనమ్ కు కౌంటర్లు ఇస్తున్నారు.

పవన్ కల్యాణ్ ను విమర్శించాలనే ఉద్దేశంతో ఆమె పోస్టర్ ను తప్పుపడుతోందంటూ పవన్ కల్యాణ్ అభిమానులు పూనమ్ పై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతానికి ఇటువంటి విషయాలను పట్టించుకునే స్థితిలో ఆ చిత్ర బృందం లేదు. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'గబ్బర్ సింగ్' మే 11నే విడుదలైంది. ఆ సినిమా 11వ వార్షికోత్సవం పూర్తి చేసుకుంటున్న సమయంలోనే 'ఉస్తాద్ భగత్ సింగ్' టీజర్‌ను లాంచ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+