ఏపీలో భర్తలను మించిన భార్యలు ఉన్నారు: పవన్‌కు ఆ విషయం తెలియట్లేదు

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ప్రముఖ సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మరోసారి సంచలన వాఖ్యలు చేశారు. ఏపీలో భర్తలను మించిన భార్యలు ఉన్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా బ్రహ్మణిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 Posani Krishna Murali

భర్త తప్పు చేస్తే నిలదీయాల్సింది పోయి.. వాటిని సమర్థిస్తున్నారంటూ పోసాని కృష్ణమురళి ధ్వజమెత్తారు. భర్త చంద్రబాబు, కొడుకు నారా లోకేష్ భవిష్యత్తు నాశనం కావడానికి ప్రధాన కారణం భువనేశ్వరి వ్యవహార శైలేనంటూ పోసాని ఆరోపించారు. అత్తాకోడళ్లు ఇద్దరూ తమ ఆయన మంచివాళ్లని అనుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు.

తప్పు చేసింది చంద్రబాబు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో కోట్ల రూపాయలను కొల్లగొట్టింది చంద్రబాబు, స్కాం చేసింది చంద్రబాబు, నిరుద్యోగుల పేరుతో అడ్డంగా దోచుకున్నది చంద్రబాబే అయినప్పుడు ఆయనను జైలుకు పంపించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతారని ప్రశ్నించారు పోసాని.

అలా పంపించాలని వైఎస్ జగన్ అనుకుని ఉంటే నాలుగు సంవత్సరాల పాటు ఆగేవారు కాదని, అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే చంద్రబాబును కటకటాల వెనక్కి నెట్టేసి ఉండేవారని పోసాని అన్నారు. చేసిన నేరాలు, కుంభకోణాలు బయటపడటం వల్లే ఆయనకు బెయిల్ కూడా దొరకట్లేదని గుర్తు చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పైనా పోసాని కృష్ణమురళి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేష్‌ను బండ బూతులు తిట్టిన పవన్ కల్యాణ్‌ ఇప్పుడు వారిని నెత్తిన పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లేదా నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిగా చూడటానికి యాత్రలు చేస్తోన్నాడంటూ చురకలు అంటించారు.

అవనిగడ్డలో వారాహి యాత్ర సందర్భంగా పవన్ కల్యాణ్‌ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఆయనకు విషయ పరిజ్ఞానం లేదని, పిచ్చోడంటూ ధ్వజమెత్తారు పోసాని. అమాయకుడంటూ ఘాటుగా స్పందించారు. కాపు ఓట్ల కోసమే టీడీపీ నేతలు పవన్ కల్యాణ్‌‌తో సత్సంబంధాలు పెట్టుకున్నారని, ఆ విషయం ఆయనకు తెలియట్లేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+