పొత్తుతో పవన్ ఆస్తులు పెరిగాయి - మనోహర్‌కి స్పోర్ట్స్ కారు..!!
జనసేనాని పవన్ కల్యాణ్ పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీని బలోపేతం చేయటం కోసమే పవన్ పని చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. జైలులో చంద్రబాబును కలిసిన తరువాత పవన్ కొన్న ఆస్తుల వివరాలు బయట పెడతానని చెప్పారు. పవన్‌పై దిల్ రాజు ఐటీకి ఫిర్యాదు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. పవన్ ది బ్రాండ్ కాదని..మోసమని విమర్శించారు.
వసూళ్లు - విరాళాలు
ఎలక్టోరల్ బాండ్స్‌లో పవన్ కల్యాణ్‌కి ఎంత ముట్టిందో చెప్పాలంటూ వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు తానే బయటపెడతానని చెప్పుకొచ్చారు.
కౌలు రైతుల పేరుతో ఎన్నారైల నుంచి వసూలు చేసిన చందాలెంతో చెప్పాలని డిమాండ్ చేసారు. అందులో రైతులకు ఇచ్చినది ఎంత.. పవన్ కళ్యాణ్ వెనకేసుకొన్నది ఎంత వివరాలన్నీబయట పెట్టాలన్నారు. నాదెండ్ల మనోహర్‌కి స్పోర్ట్స్ కారు కొనేందుకు పది కోట్లు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏ ఎజండాతో పవన్ పార్టీ పెట్టారని నిలదీసారు. చంద్రబాబు పల్లకీ మోయటమే పవన్ లక్ష్యమా అంటూ మండిపడ్డారు.

ఆస్తులు పెరిగాయి
కాపు యువతని టీడీపీ జెండాలు మోసే కూలీలుగా పవన్ భావిస్తున్నారా అని పోతిన ప్రశ్నించారు. జనసైనికులకి పవన్ సమాధానం చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. జనసేనను వీడిన వాళ్లంతా వైఎస్సార్‌సీపీపార్టీలోనే చేరుతున్నారన్నారు. పది జిల్లాలో అస్సలు జనసేన పార్టీనే లేదన్నారు. చంద్రబాబు ఆర్ధిక ప్యాకేజీకి పవన్ అమ్ముడుపోయారని ఆరోపించారు. జైలు వద్ద బాబుతో ములాఖత్ అయ్యాక పవన్ చాలా ఆస్తులు కొన్నారని ఆరోపించారు. ఆ వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు. మంగళగిరి లో పార్టీ కార్యాలయం కొనుగోలుకు ఏ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చాయని ప్రశ్నించారు.
చర్చకు సిద్దం
టీటీడీకి ఒక్కరూపాయి కూడా పవన్ విరాళం ఇవ్వరని... ఖాజా దగ్గర ఉన్న దశావతారం టెంపుల్‌కే విరాళాలు ఎందుకు ఇస్తారో పవన్ చెప్పాలన్నారు. హరిహర వీరమల్లు సినిమా బ్లాక్‌ని వైట్ చేసుకొనే రూటింగ్ అవుతుందని ఆరోపించారు. పవన్‌పై దిల్ రాజు ఐటీకి ఫిర్యాదు చేసింది నిజం కాదా అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. జనసేన అభ్యర్థులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారని చెప్పారు. జనసేన ను టీడీపీ లో విలీనం చేసేసారా అని నిలదీసారు. రాజకీయాలని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించటంలో నాదెండ్ల మనోహర్ దిట్టగా పేర్కొన్నారు. తన ప్రశ్నలకు సమాధానం ఇస్తానంటే ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమని పోతిన మహేష్ సవాల్ చేసారు.












Click it and Unblock the Notifications