నీకు దమ్ముంటే..: బాలినేనికి సవాల్

Buchepalli Venkayamma: పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన విమర్శలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఘాటుగా స్పందించారు. సవాల్ విసిరారు.

బూచేపల్లి సీటును లాగేస్తానని, జెడ్పీటీసీని పడగొడతానని, తనను ఛైర్‌పర్సన్ స్థానం నుంచి పదవీచ్యుతురాలిని చేస్తానంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి చెబుతున్నాడని, తన సీటును టచ్ కూడా చేయలేడని వెంకాయమ్మ సవాల్ విసిరారు. బాలినేని ఆశచూపే డబ్బులుకు గానీ, బెదిరింపులకు గానీ భయపడేవాళ్లిక్కడ ఎవరూ లేరని అన్నారు.

Balineni

దమ్ముంటే జెడ్పీటీసీ సభ్యులతో రాజీనామా చేయించి ఆయన పార్టీలోకి తీసుకోవాలని చెప్పారు. తమ కుటుంబం మీద ఉన్న అభిమానంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను జడ్పీటీసీ ఛైర్‌పర్సన్ చేశారని, పార్టీ మీద అభిమానంతో ఇక్కడ అందరం పని చేస్తోన్నామని అన్నారు. ఏ కారణంతో తన సీటును లాగేయాలనుకుంటున్నావో వెల్లడించాలని వెంకాయమ్మ నిలదీశారు.

ఏ అర్హత ఉందని బాలినేని శ్రీనివాసరెడ్డి తన కుర్చీని లాగేస్తాడని ప్రశ్నించారు. అసలా అర్హతే లేదని తేల్చి చెప్పారు. తనతో పాటు ప్రెస్ మీట్‌లో జడ్పీటీసీలు అందరూ ఉన్నారని, ఎవ్వరూ పార్టీని వీడి బయటికి వెళ్లే వాళ్లు కాదంటూ ధీమా వ్యక్తం చేశారు. పార్టీని వీడిపోయినా బాలినేని అంటే ఒంగోలులో కొంతమందికి అభిమానం ఉండేదని, పిఠాపురం సభలో ఆయన ప్రసంగం విన్న తరువాత ఆయనను అసహ్యించుకుంటోన్నారని చెప్పారు.

ఇక జగన్మోహన్ రెడ్డి గెలవలేడని బాలినేని చెబుతున్నాడని, 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేది జగనేనని స్పష్టం చేశారు బూచేపల్లి వెంకాయమ్మ. 2004 నుంచి తాము రాజకీయాల్లో ఉంటోన్నామని, బూచేపల్లి కుటుంబానికి ఎలాంటి పేరు ఉందో బాలినేనికి బాగా తెలుసునని పేర్కొన్నారు.

బూచేపల్లి సుబ్బారెడ్డి ఆశయాలకు అనుగుణంగా తాము పని చేస్తోన్నామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటోన్నామని చెప్పారు. బాలినేని లాగా అవినీతికి, లంచాలు తీసుకునే అలవాటు తమకు లేదని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీని వీడే ప్రసక్తి తమకు గానీ, తమ జెడ్పీటీసీలకు గానీ లేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+