పవన్ కల్యాణ్‌ను వదలని ప్రకాష్ రాజ్..ఈసారి తమిళ హీరోను లాగేశారుగా..!

తిరుమల లడ్డూ ప్రసాద వివాదం సినీ ఇండస్ట్రీని సైతం తాకింది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్.. మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై వస్తే మద్దతుగా రండి, లేకపోతే సైలెంట్‌గా ఉండండంటూ హితవు పలికారాయన. ఈ సమయంలో నటుడు ప్రకాష్ రాజ్‌పై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

అసలు లడ్డూ వివాదానికి ప్రకాష్ రాజ్‌కు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని, అలాంటప్పుడు ప్రకాష్ రాజ్‌కు ఎందుకు ఈ వివాదంపై స్పందిస్తున్నారని పవన్ నిలదీశారు. ఇదే సమయంలో తమిళ హీరో కార్తీపై కూడా పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కార్తీ హీరోగా నటించిన ''సత్యం సుందరం'' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన కార్తీని లడ్డు కావాలా నయానా అంటూ యాంకర్ అడగడం..దీనిపై కార్తీ స్పందిస్తూ...ఇప్పుడు లడ్డూ సెన్సిటివ్ మ్యాటర్ మాట్లాడకూడదంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోలు ఇలా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు.

prakash raj once again satires on pawan kalyan

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన కార్తీ.. ఆయనకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పడం జరిగింది. తాజాగా దీనిపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ''చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్'' అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. చేయని తప్పుకి తమిళ కార్తీతో సారీ చెప్పించడంపై ఆయన ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారని అర్థం అవుతోంది. ఇక పవన్ తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ మంగళవారమే స్పందించారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నానని, ఈ నెల 30న దీనిపై స్పందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. నేను వచ్చిన తర్వాత మీ ప్రతి మాటకు సమాధానం చెబుతానని ప్రకాష్ రాజ్ తెలిపారు.నేను చెప్పిందేంటి.. మీరు అర్థం చేసుకుంది ఏంటని పవన్ కల్యాణ్‌ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మీకు వీలైతే నా ట్వీట్ మళ్లీ చదువుకోండంటూ పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+