మరోసారి పవన్ కళ్యా‌ణ్‌పై ప్రకాష్ రాజ్ సెటైర్లు.. సినిమా కాదంటూ !

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కళ్యాణ్ పై ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ మ‌రోసారి సెటైర్లు వేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న జాతీయ అవార్డులు, రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన స‌మ‌యంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి మాట్లాడిన ప‌వ‌న్‌.. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చాక వాటి గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. అధికారంలో ఉండి కూడా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌కుండా టైంపాస్ ప‌నులేంటి? అని నిల‌దీశారు. పలు‌ర‌కాలుగా మాట్లాడ‌టానికి ఇదేం సినిమా కాదని సెటైర్లు వేశారు.

అంతే కాకుండా తిరుపతి లడ్డూ వివాదంపై కూడా ప్రకాష్ రాజు స్పందించారు. అది చాలా సున్నితమైన అంశమని.. భక్తుల మనోభావాలకు సంబంధించిందని చెప్పారు. ఇలాంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. లడ్డూ తయారీలో నిజంగానే కల్తీ జరిగితే బాధ్యులను వెంటనే శిక్షించాలని ప్రకాష్ రాజ్ కోరారు.

prakash-raj-once-again-satirizes-pawan-kalyan-saying-its-not-a-movie

అలాగే తాను స‌నాత‌న ధ‌ర్మానికి వ్య‌తిరేకిని కాద‌న్నారు. ఇక గ‌తంలోనూ ప‌వ‌న్‌ను ఉద్దేశించి ప్ర‌కాశ్‌రాజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెట్టిన విష‌యం తెలిసిందే. త్రిభాషా విధానం అంశంలో, తిరుమ‌ల ప్ర‌సాదం ల‌డ్డూ విషయంలో సైతం పవన్ పై షాకింగ్ పోస్టులు పెట్టారు.

రీసెంట్ గా జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిభాషా విధానంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొందరు హిందీ భాషపై గగ్గోలు పెడుతున్నారంటూ పరోక్షంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు చురకలు అంటించారు. హిందీ భాష నేర్చుకోవల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అందుకు ప్రకాష్ రాజ్.. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని, స్వాభిమానంతో తమ మాతృభాషను, తమ తల్లిని కాపాడుకోవడమేనని పవన్ కళ్యాణ్‌కు ఎవరైనా చెప్పండి ప్లీజ్..జస్ట్ ఆస్కింగ్ అంటూ ముగించారు ప్రకాశ్ రాజ్

గతంలో తిరుపతి లడ్డూ ఇష్యూని జాతీయ సమస్యగా మార్చవద్దని, ముందుగా దోషులను కనుగొని వారిని శిక్షించాలని ప్రకాష్ పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రియమైన పవన్ కళ్యాణ్ ... మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది ... దయచేసి దర్యాప్తు చేయండి. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండని ట్వీట్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+