పవన్ కల్యాణ్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్..అర్థం కాకపోతే మళ్లీ చదువుకో..!
తిరుమల లడ్డూ ప్రసాద వివాదం సినీ ఇండస్ట్రీని సైతం తాకింది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్.. మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ మెట్లను శుభ్రం చేశారు. ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మెట్లకు పూజ చేశారు.
అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై వస్తే మద్దతుగా రండి, లేకపోతే సెలైంట్‌గా ఉండండంటూ హితవు పలికారాయన. ఈ సమయంలో నటుడు ప్రకాష్ రాజ్‌పై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అసలు లడ్డూ వివాదానికి ప్రకాష్ రాజ్‌కు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని, అలాంటప్పుడు ప్రకాష్ రాజ్‌కు ఎందుకు ఈ వివాదంపై స్పందిస్తున్నారని పవన్ నిలదీశారు.

అయితే పవన్ తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నానని, ఈ నెల 30న దీనిపై స్పందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. నేను వచ్చిన తర్వాత మీ ప్రతి మాటకు సమాధానం చెబుతానని ప్రకాష్ రాజ్ తెలిపారు.నేను చెప్పిందేంటీ.. మీరు అర్థం చేసుకుంది ఏంటని పవన్ కల్యాణ్‌ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మీకు వీలైతే నా ట్వీట్ మళ్లీ చదువుకోండంటూ పవన్ కల్యాణ్‌కు సెటైర్ వేశారు.
పవన్ కల్యాణ్‌కి ప్రకాష్ రాజ్ రిప్లై.. ప్రతిమాటకు అప్పుడే బదులిస్తా..!!#PrakashRaj #PawanKalyan #TirupatiLaddu #ViralVideos #Oneindiatelugu pic.twitter.com/30daR4EStZ
— oneindiatelugu (@oneindiatelugu) September 24, 2024
గతంలో తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ గారు...మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది .. దయచేసి దర్యాప్తు చేయండి .. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారని పవన్ కల్యాణ్‌ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.దీన్ని జాతీయ సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారని పవన్ కల్యాణ్‌ను ఆయన నిలదీశారు. దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీకి సైతం కౌంటరిచ్చారు. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ సెటైర్స్ వేశారు. చివరగా జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు ప్రకాష్ రాజ్ కౌంటరిచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications