ఏబీ వేంకటేశ్వర రావు, జాస్తికి ప్రవీణ్ ప్రకాశ్ క్షమాపణ..!!

ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ సంచలన వీడియో విడుదల చేసారు. రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వేంకటేశ్వర రావు... రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌కు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాను వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరి పైన వ్యవహరించిన తీరుకు బాధ పడుతున్నట్లు చెబుతూ.. పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆకస్మికంగా ప్రవీణ ప్రకాశ్ ఈ రకమైన ప్రకటన చేయటం పైన అధికార వర్గాల్లో ఆసక్తి కర చర్చ జరుగుతోంది.

సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. ఏపీలో సుదీర్ఘ కాలం పని చేసిన ప్రవీణ్ ప్రకాశ్ వైసీపీ హయాంలో కీలక పాత్ర పోషించారు. జగన్ సీఎం గా ఉన్న వేళ ప్రవీణ్ ప్రకాశ్ కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి వచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో.. సాధారణ పరిపాలనా ముఖ్య కార్యదర్శిగానూ వ్యవహరించారు. ఆ రోజుల్లో చోటు చేసుకున్న పరిణా మాలతో నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం ను ఆ హోదా నుంచి తప్పిస్తూ ప్రవీణ్ ప్రకాశ్ జీఏడీ పొలిటికల్ సెక్రటరీ హోదాలో జీవో జారీ చేయటం వివాదాస్పదం గా మారింది. జూనియర్ అధికారిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ నాడు వ్యవహరించిన తీరు పైన అధికార వర్గాల్లోనూ చర్చ జరిగింది.

praveen-prakash-suddenly-apologizes-to-rtd-ips-ab-venkateswara-rao-details-here

కాగా, జగన్ హయాంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావుకు ఆయన పదవీ విరమణ వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు తాజా వీడియోలో గతేడాది సోషల్ మీడియాలో ప్రవీణ్ ప్రకాశ్ కీలక అంశాలను ప్రస్తావించారు. తాను దారుణంగా ట్రోల్‌కు గురయ్యానని చెప్పారు. ఏం తప్పు చేశాననే అంశంపై తీవ్రంగా ఆలోచించానని..30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పని చేశానని వివరించారు. తన సర్వీస్‌లో ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదని చెప్పారు. చట్టానికి విరుద్ధంగా ఏనాడూ ప్రవర్తించలేదు.. 2000-2004 వరకు గుంటూరు, విజయవాడలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశానని.. గుంటూరు, విజయవాడకు చేసిన సేవలు నన్ను హీరోని చేశాయి, కానీ.. ఒక్క తప్పుతో హీరోగా ఉన్న నేను విలన్‌గా మారిపోయి.. సమాజం పెట్టిన టెస్టులో నేను ఫెయిల్ అయ్యానన్నారు. తాను తప్పు చేశాననే భావనతోనే VRSకు అప్లయ్ చేసినట్లు వివరించారు.

ఇక, 2020లో ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో.. ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆఫీస్ నుంచి ఫైల్ వచ్చింది. తన కంటే ఏబీ వెంకటేశ్వరరావు ఐదేళ్ల సీనియర్ ఆఫీసర్.. డీజీపీ ఆఫీస్ ఫైల్ ప్రకారమే .. ఏబీవీపై చర్యలు తీసుకోవచ్చని చెప్పానని ప్రవీణ్ ప్రకాశ్ వివరించారు. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో తాను చేసిన తప్పు అర్థమైందని... ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ విషయంలోనూ తప్పు జరిగిందంటూ ఏబీ వెంకటేశ్వరరావు, కృష్ణకిషోర్‌కు క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాశ్ విడుదల చేసిన ఈ వీడియో పైన అధికార వర్గాల్లో ఆసక్తి కర చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+