
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన ప్రారంభమైంది. ఉదయం 9.35 నిమిషాలకు రాష్ట్రపతి దంపతులు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. దేశ ప్రధమ పౌరుడైన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ దంపతులకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రపతి ముందుగా ఆచార్య నాగార్జునా యూనివర్శిటీలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ది వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఫైబర్ గ్రిడ్ ను ప్రారంభించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన పాలన కోసం వినియోగిస్తున్నరియల్ టైమ్ గవర్నెన్స్ విధానాన్ని పరిశీలిస్తారు.
ఈ వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా రాష్ట్రపతికి వివరిస్తారని తెలిసింది. రాష్ట్రపతి కోవింద్ దంపతుల కోసం అమరావతిలో సీఎం చంద్రబాబు పసందైన విందు ఏర్పాటుచేశారు.

రాష్ట్రపతి కోసం పసందైన విందు ఏర్పాట్లు...
అమరావతిలో రాష్ట్రపతి కోవింద్‌కు సీఎం చంద్రబాబు పసందైన విందు ఇవ్వనున్నారు. ఉత్తర, దక్షిణ భారత వంటకాలను వడ్డించనున్నారు. రాష్ట్రపతి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేకంగా అరకు కాఫీని తెప్పిస్తున్నారు. స్వీట్స్ సహా ఆంధ్రా ప్రత్యేక వంటకాలు విందులో నోరూరించనున్నాయి. రాష్ట్రపతి హోదాలో అమరావతి పర్యటనకు తొలిసారి వస్తున్న రామ్‌నాథ్ కోవింద్‌కు సీఎం చంద్రబాబు మరిచిపోలేని ఆతిథ్యం ఇవ్వనున్నారు. నార్త్, సౌత్ ఇండియా వంటకాలు సహా ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్‌ను విందు మెనూలో చేర్చుతున్నారు.

ఆంధ్రా స్పెషల్స్ కూడా...
ఆంధ్రాకు మాత్రమే చెందిన స్వీట్స్‌ను రాష్ట్రపతికి రుచి చూపించనున్నారు. చూడగానే నూరూరే వంటకాలను సిద్ధం చేయిస్తున్నారు. రాష్ట్రపతి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేకంగా అరకు నుంచి కాఫీని తెప్పిస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాత్ కోవింద్ శాకాహారి కాగా ఆయన సతీమణి సవితా కోవింద్ మాత్రం మాంసాహారి. భోజన సమయంలో ఏపీకి చెందిన క్లాసికల్ మ్యూజిక్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రపతికి ఇచ్చే విందులో మొత్తం 22మంది వరకు భోజనం చేయనున్నారు. విందు కోసం ప్రత్యేక మెనూను సీఎం సిద్ధం చేయించారు. అన్ని ఆర్గానిక్ ఫుడ్ ఐటెమ్స్‌ను తయారు చేయిస్తున్నారు.

సాంప్రదాయ వంటకాలు సైతం...
అందులో ట్రెడిషినల్ స్వీట్స్ సూప్స్, సలాడ్స్, వెజ్ , నాన్‌వెజ్ ఐటమ్స్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఐటమ్స్ మెనూలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విందు మెనూలో ట్రెడిషనల్ స్వీట్లు బొబ్బట్లు, పూతరేకులు, షుగర్ ఫ్రీ జున్ను, ఆవునేతితో చేసిన అరిసెలు, కాకినాడ కాజా, జిలేబీ ఉండగా, సూప్ ఐటెమ్‌లో వెజ్, నాన్‌వెజ్‌కు సంబంధించి టామ్‌యామ్, ధనియా షోర్వా ఉన్నాయి. ఇక సలాడ్ ఐటెమ్స్‌లో గ్రీన్ సలాడ్, రెయిన్‌బో సలాడ్ విత్ హనీ, ఆలుచానా ఉన్నాయి. ఇక నాన్‌వెజ్ ఐటెమ్స్‌లో గారె విత్ నాటు కోడి కూర, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, రొయ్యల ఇగురు, కడాయ్ రొయ్య, తవాఫిష్, కోనసీమ ఫ్రైడ్ ఫిష్, ఎగ్ కర్రీ సిద్ధం చేస్తున్నారు.

వెజిటేరియన్ ఐటెమ్స్....
వెజ్ ఐటెమ్స్‌లో భాగంగా కొబ్బరి చట్నీ, కట్ మిర్చి బిర్యానీ, ఆంధ్రా వెజ్ పలావ్, కాకరకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, పన్నీర్ కాలీ మిర్చి, పన్నీర్ టిక్కా మసాలా, మెతి చమాన్ ఉండగా, పుట్టగొడుగుల కూర, బగారా బెగాన్, రాయలసీమ ఫేమస్ రాగి సంకటి, ఉలవచారు, పప్పుచారు, మిక్స్‌డ్ రైతా, పచ్చళ్లు, కుండ పెరుగును మెనూలో చేర్చారు. కట్ ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్ పాన్, హాట్ పాన్‌ను అందించనున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!