మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో: ఒకేసారి ఏడు ఉపగ్రహాలు నింగిలోకి, ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోసన్నాహాలు జరుగుతున్నాయి. జులై 30న ఉదయం 6.30 గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి డీఎస్ఎల్వీ-ఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ56 ప్రయోగించనున్నారు.
ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్-ఎస్ఏఆర్ శాటిలైట్ తోపాటు మరో ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో వెల్లడించింది. సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలకు ఉపగ్రహ ఛాయాచిత్రాల అవసరాల నిమిత్తం డీఎస్-ఎస్ఏఆర్ ను ప్రయోగిస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.

డీఎస్-ఎస్ఏఆర్ తోపాటుటెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్-ఏఎం, ఎక్స్‌పెరిమెంటల్ శాటిలైట్ ఆర్కేడ్, 3యూ నానో శాటిలైట్ స్కూబ్-2, ఐవోటీ కనెక్టివ్ నానోశాటిలైట్ నూలయాన్, గలాసియా-2, ఓఆర్బీ-12 స్ప్రైడర్ శాటిలైట్లను కూడా నింగిలోకి పంపనుంది. కమర్షియల్ పీఎస్‌ఎల్వీ మిషన్‌లో భాగంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) తరఫున ఈ ఏడు ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ఇస్రో సోమవారం వెల్లడించింది.
జులై నెల 30న ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోటలోని స్పేస్‌పోర్ట్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి డీఎస్‌ఎల్‌వీ-ఎస్ ఏఆర్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ56 ప్రయోగించనుంది. డీఎస్-ఎస్‌ఏఆర్ ఉపగ్రహం బరువు 360 కిలోలు.
🇮🇳PSLV-C56🚀/🇸🇬DS-SAR satellite 🛰️ Mission:
— ISRO (@isro) July 24, 2023
The launch is scheduled for
📅 July 30, 2023
⏲️ 06:30 Hrs. IST
🚩First launch pad SDSC-SHAR, Sriharikota. @NSIL_India has procured PSLV-C56 to deploy the DS-SAR satellite from DSTA & ST Engineering, Singapore
and 6 co-passenger… pic.twitter.com/q42eR9txT7
సింగపూర్‌కు చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (డీఎస్టీఏ), ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఉపగ్రహం పగలు-రాత్రి కవరేజీని అందివ్వనుంది. ఇది పూర్తి పోలారిమెట్రీ వద్ద 1 మీ-రిజల్యూషన్ వద్ద ఇమేజింగ్ చేయగలదు. సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు సేవలందించనుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications