చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో ఆమె సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్..!!

Chandrababu Naidu: రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటైన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్.. ఆయనతో ప్రమాణం చేయించారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతోండటం విభజనాంధ్ర ప్రదేశ్‌లో ఇది రెండోసారి. మొత్తంగా నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు, రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 2014లో ప్రమాణ స్వీకారం చేశారాయన. ఇప్పుడు మళ్లీ ఈ పదవిని అందుకున్నారు.

Pulivarthi Trisha Reddy has attend the Chandrababu Naidu s oath taking ceremony

తొలుత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పవన్ కల్యాణ్, నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు.. ఇలా వరుసగా 24 మంత్రులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు అభివాదం చేయడం హైలైట్‌గా నిలిచింది.

ఈ కార్యక్రమానికి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరయ్యారు. సోమవారమే బాధ్యతలు స్వీకరించిన ఇతర కేంద్ర మంత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు డాక్టర్ పులివర్తి త్రిషా రెడ్డి. తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రగిరి శాసన సభ్యుడు పులివర్తి నాని కోడలు ఆమె. తన అత్త మామ పులివర్తి నాని, సుధారెడ్డి, భర్తతో కలిసి త్రిషారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు కేటాయించిన చోట కూర్చున్నారు.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన పులివర్తి నాని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుధారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అదే తరహాలో నాని కుమారుడు కూడా రెడ్డి సామాజిక వర్గానికే చెందిన డాక్టర్ త్రిషా రెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో నానిని గెలిపించాలంటూ త్రిషారెడ్డి విడుదల చేసిన ఓ వీడియో అప్పట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+