పులివెందులలో జగన్ పై కేసు నమోదు- హైకోర్టులోనూ ఎదురు దెబ్బ..!!
స్థానిక ఎన్నికల వేళ పులివెందుల కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ప్రారంభం నుంచి పులివెందుల పైన కూటమి నేతలు ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. జగన్ కోటలో ఎలాగైనా విజయం సాధించాలని డిసైడ్ అయ్యారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు జరిగిన పరిణామాల పైన జగన్ నిరసనకు దిగారు. ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేసారు. హైకోర్టుకు వెళ్లారు. ఇటు జగన్ పైన పులివెందులలో కేసు నమోదు అయింది.
పులివెందులలో స్థానిక సమరంలో వరుస చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిగా మారాయి.
పులివెందులలో నామినేషన్ల పర్వం నుంచి పోలింగ్ రోజున కీలక అంశాలు తెర మీదకు వచ్చాయి. పోలింగ్ వేళ తమ ఏజెంట్లకు అవకాశం లేకుండా చేసారని జగన్ నిరసనకు దిగారు. ప్రభుత్వం పోలీసుల సాయంతో గెలవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పోలింగ్ రోజు పులివెందుల మున్సిపల్ కార్యాలయం వద్ద జగన్ ధర్నా చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ధర్నా చేశారని ఈ మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. జగన్ తో పాటుగా అవినాశ్, ధర్నాలో పాల్గొన్న మరో 70 మంది పైనా కేసు రిజిస్టర్ అయింది. అయితే, జగన్ ఎన్నికల ఆర్వో కు వినతి పత్రం ఇచ్చారు. పోలింగ్ సమయంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు.

పులివెందుల కౌంటింగ్ కు దూరంగా వైసీపీ
ఇక, పులివెందుల పోలింగ్ సమయంలో అక్రమాలు జరగాయని.. కౌంటింగ్ నిలుపుదల చేసి... తిరిగి పోలింగ్ కు ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ హైకోర్టను ఆశ్రయించింది. ఎంపీ అవినాశ్ రెడ్డి హై కోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేసారు. విచారణ తరువాత ఈ ఉదయం 7.30 గంటలకు తీర్పు ఇస్తామని హైకోర్టు వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా ఈ ఉదయం వెల్లడించిన తీర్పులో పులివెందులలో కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో.. మిగిలిన ప్రాంతాలతో పాటుగా పులివెందులలోనూ కౌంటింగ్ మొదలైంది. అయితే, ఈ ఓట్ల లెక్కింపు కు వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్ధులు.. నేతలు దూరంగా ఉన్నారు.













Click it and Unblock the Notifications
