పుష్ప 2.. వైల్డ్ ఫైర్ కాదు.. వరల్డ్ ఫైర్.. రాంబాబు రివ్యూ

Pushpa-2: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియా కొనసాగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన మూవీ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాడు. నిన్న సాయంత్రం నుంచే ప్రిమియర్లు పడగా.. థియేటర్ల వద్ద సండటి మొదలైంది. సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే సినిమాపై రివ్యూలు కూడా గట్టిగానే వస్తున్నాయి. మరో వైపు వైసీపీ సైడ్ నుంచి ఈ సినిమాకు ఫుల్ సపోర్ట్ వచ్చేసింది. చాలా మంది వైసీపీ నేతలు ప్రిమియర్లు, బెనిఫిట్ షోలు చూశారు. అలాగే రివ్యూలు కూడా ఇచ్చారు. ఏపీ వ్యాప్తంగా వైసీపీ పుష్ప 2 ను తన భుజాన ఎత్తుకున్నట్లు కనిపిస్తుంది.

అంబటి రాంబాబు రివ్యూ

ఈ నేపథ్యంలోనే వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పుష్ప 2 ది రూల్ సినిమాకు రివ్యూ ఇచ్చారు. Pushpa అంటే WildFire అనుకుంటివా .. కాదు "World Fire" అంటూ ఏక్స్ లో రాసుకొచ్చారు. నిన్న సాయంత్రం ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. తెలుగు సినిమా పుష్ప 2 ను అందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని, ఆదారించాలని కోరారు. మరో వైపు నంద్యాల మాజీ ఎమ్మెల్యే, అల్లు అర్జున్ ఫ్రండ్ శిల్పా రవిచంద్రా రెడ్డి కూడా ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు. నిన్న బన్నీతో కలిసి సంధ్య 70 ఎంఎం థియేటర్కు ఒకే కారులో వచ్చిన శిల్పా రవి చంద్ర.. బన్నీతో కలిసి సినిమా చూశారు.

Pushpa-2 Its not wild fire but world fire Ex minister Ambati Rambabu review on Allu Arjuns flick

సినిమా విడుదలకు ముందు.. కోల్డ్ వార్ భయంకరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఉంటే పుష్ప-2 సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.

మెగా ఫ్యామిలీ V/s అల్లు ఫ్యామిలీ

ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. దీంతో అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమాపై మెగా అభిమానులు నెగిటివ్‌ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. మెగా అభిమానులు పుష్ప-2 చూడవద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

అయితే ఇదే సమయంలో పుష్ప-2 సినిమాకు వైసీపీ మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా సినిమా విడుదల సమయంలో వైసీపీ అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో అల్లు అర్జున్‌తో పాటు జగన్ ఫొటో కూడా దర్శనం ఇచ్చింది. మా కోసం నువ్వు వచ్చావు...మీ కోసం మేము వస్తాం. మీ అభిమానం కోసం దేనికైనా తగ్గేదేలే అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.అనంతపురం జిల్లా గుత్తిలో ఓ థియేటర్ వద్ద వైసీపీ అభిమానులు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+