అల్లు అర్జున్ తప్పేముంది?- పురంధేశ్వరి
MP Purandeswari: అల్లు అర్జున్ అరెస్ట్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండట్లేదు. ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు.

డాక్టర్ చేతన్ ఆర్ ముందాడ, డాక్టర్ విష్ణు తేజ్ పూడి పర్యవేక్షణలోని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటోన్నాడు. ఈ నెల 4వ తేదీన సంఘటన జరిగినప్పటి నుంచీ ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పులు ఉండట్లేదు. విషమంగానే ఉంటోందా బాలుడి ఆరోగ్యం. బ్రెయిన్ డ్యామేజ్‌కు గురయ్యాడు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ముందు రాష్ట్రంలో ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించింది. అలాంటి షోలు రద్దు చేస్తామంటూ నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా వెల్లడించారు. రేవతి మృతిపట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ రాజమండ్రి లోక్‌సభ సభ్యురాలు, ఈ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. అల్లు అర్జున్‌కు పూర్తి మద్దతు తెలిపారు. సంధ్యా థియేటర్‌లో వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తప్పు లేదని తేల్చి చెప్పారు.
సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట సంఘటన చోటు చేసుకున్నప్పుడే ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని, స్పందనను తెలియజేశానని పురంధేశ్వరి గుర్తు చేశారు. పుష్ప 2 సినిమాలో నటించిన కథానాయకుడిగా అల్లు అర్జున్ ఆ రోజున థియేటర్‌కు వచ్చారని, ఇది- ఆయన ప్రేరేపించింది కాదని అన్నారు.
ఈ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఏ11గా ఉన్నారని, ముందున్న వారిని వదిలేసిన ఆయనను ఒక్కడినే అరెస్ట్ చేయడం అనేది సరి కాదనేది తమ అభిప్రాయమని పురంధేశ్వరి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో కూడా దీనిపై జరిగినట్టుంది కదా? అంటూ విలేకరులకు గుర్తు చేశారామె.
-
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!












Click it and Unblock the Notifications