మెగా కాంపౌండ్ వర్సెస్ నందమూరి: సినిమా హాళ్ల వద్ద ఉద్రిక్తత: హిందూపురంలో రాళ్లు రువ్విన ఫ్యాన్స్
అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప సినిమా బెనిఫిట్ షోను ప్రదర్శించకపోవడం పట్ల మెగా కాంపౌండ్ అభిమానులు అసహనానికి గురయ్యారు. ఆగ్రహోదగ్రులయ్యారు. థియేటర్ వద్ద ధర్నా చేశారు. యాజమాన్యానికి నిరసనగా నినాదాలు చేశారు. అక్కడితో ఆగలేదు. థియేటర్‌పై రాళ్లు విసిరారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అభిమానులను చెదరగొట్టారు. థియేటర్‌కు తాళాలు వేశారు.

నందమూరి ఫ్యాన్స్‌కు గట్టిపట్టు..
హిందూపురం తెలుగుదేశం పార్టీకి, నందమూరి కుటుంబం అభిమానులకు గట్టిపట్టు ఉన్న పట్టణం. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడిగా ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుంచే వరుసగా రెండుసార్లు ఘన విజయం సాధించారు. బాలకృష్ణ నటించిన అఖండ సినిమా హిందూపురంలో ఇంకా ప్రదర్శితమౌతోంది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన భారీ బడ్జెట్ మూవీ ఇది. అంచనాలకు తగ్గట్టుగానే రన్ అవుతోంది.

పుష్ప రాకతో..
అదే సమయంలో మెగా కాంపౌండ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మరో భారీ బడ్జెట్ మూవీ పుష్ప కూడా ఇవ్వాళే విడుదలైంది. దీనితో నందమూరి-మెగా కాంపౌండ్ హీరోల మధ్య పోటీ నెలకొన్నట్టు కనిపిస్తోంది. పుష్ప సినిమా విడుదలకు ముందు నుంచే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ అభిమానులు పోటాపోటీగా బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 2వ తేదీన విడుదలైన అఖండ మూవీని అధిగమించేలా, కంప్లీట్‌గా డామినేట్ చేసేలా కలెక్షన్లు ఉండేలా రన్ చేయించాలని భావించారు.

నిషేధం ఉన్నా బెనిఫిట్ షో..
ఇదివరకు హిందూపురం గురునాథ్ థియేటర్‌లో అఖండ సినిమా బెనిఫిట్ షోను ప్రదర్శించారు. అఖండ సినిమా విడుదలయ్యే సమయానికి బెనిఫిట్ షోలపై నిషేధం ఉండేది. అయినప్పటికీ.. బాలకృష్ణ స్థానిక ఎమ్మెల్యే కావడం, ఆయన నటించిన సినిమా అయినందున బెనిఫిట్ షోలను ప్రదర్శించిందా థియేటర్ యాజమాన్యం. అదే తరహాలో పుష్ప సినిమా బెనిఫిట్ షోను ప్రదర్శించాలనే ఉద్దేశంతో మెగా కాంపౌండ్ అభిమానులు ఏకం అయ్యారు.

రూ.500ల టికెట్..
బెనిఫిట్ షో కోసం 500 రూపాయల చొప్పున వసూలు చేసుకుని, దాన్ని బాలాజీ థియేటర్ యాజమాన్యానికి అప్పగించినట్లు చెబుతున్నారు. పుష్ప సినిమా విడుదల రోజు నాడు తెల్లవారు జామున 5 గంటలకు బెనిఫిట్ షో వేయాలనేది వారి డిమాండ్. సినిమా చూడ్డానికి అభిమానులు తెల్లవారు జామున 4 గంటలకే థియేటర్ వద్దకు చేరకున్నారు. పెద్ద ఎత్తున గుమికూడారు. అల్లు అర్జున్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

షో వేయకపోవడంతో..
అభిమానుల అంచనాలు, ఆశలు తలకిందులయ్యాయి. బాలాజీ థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో వేయలేదు. దీన్ని ఉదయం 9 గంటలకు వేస్తామంటూ యాజమాన్యం స్పష్టం చేసింది. దీనితో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. థియేటర్‌పై దాడికి దిగారు. రాళ్లు విసిరారు. అద్దాలను పగులగొట్టారు. గేట్లను ఎక్కి- లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. థియేటర్ యాజమాన్యానికి నిరసనగా నినాదాలు చేశారు. దీనితో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

పోలీసుల ఎంట్రీతో..
పరిస్థితి చేయి దాటుతుండటంతో థియేటర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని చెదరగొట్టారు. థియేటర్ వద్ద గుమికూడిన అభిమానులను వెనక్కి పంపించేశారు. పోలీసు వాహనాల సైరన్ మోతలు, అభిమానుల నినాదాలతో పరిసర ప్రాంతాలు మారమోగిపోయాయి. తెల్లవారు జామునే చోటు చేసుకున్న ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Recommended Video

జిల్లావ్యాప్తంగా..
అనంతపురం జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. గోరంట్ల, కదిరి, ధర్మవరం, పెనుకొండ, అనంతపురం, ఉరవకొండ, కల్యాణదుర్గం, మడకశిర.. ఇలా చాలా చోట్ల పుష్ప సినిమా బెనిఫిట్ షోలను ప్రదర్శించలేదని తెలుస్తోంది. గోరంట్లలో తెల్లవారు జామున 5 గంటలకు పుష్ప సినిమాను ప్రదర్శించాల్సి ఉండగా.. అది రద్దయింది. దీన్ని మార్నింగ్ షోకు షిఫ్ట్ చేశారు. 9 గంటలకు సినిమా ప్రదర్శిస్తామని థియేటర్ యాజమాన్యం తెలిపింది. బెనిఫిట్ షోలను ప్రదర్శించకపోవడం పట్ల అభిమానులు నిరాశకు గురయ్యారు. థియేటర్ వరకూ వచ్చి.. వెనుదిరిగారు.
-
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు












Click it and Unblock the Notifications